Guntur Jobs : గుంటూరు ఆస్పత్రుల్లో 94 జాబ్స్.. యాదాద్రి జిల్లాలో యువతకు ఉచితంగా సాంకేతిక శిక్షణ

Guntur Jobs : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీ ప్ర్రక్రియ మొదలైంది.

Published By: HashtagU Telugu Desk
Job Alert

Job Alert

Guntur Jobs : ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 94 పోస్టుల భర్తీ ప్ర్రక్రియ మొదలైంది. ఇందుకోసం ఇప్పటికే అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. హెల్త్‌ మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ఈ భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్‌, ప్రిన్సిపల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌‌లలో వివిధ ఉద్యోగాలను(Guntur Jobs) భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న పోస్టుల జాబితాలో.. ల్యాబ్‌ టెక్నీషియన్‌, అనస్థీషియా టెక్నీషియన్‌, బయో మెడికల్‌ టెక్నీషియన్‌, సీటీ టెక్నీషియన్‌, ఈసీజీ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, రేడియోగ్రాఫర్‌, స్టోర్‌ కీపర్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌ మొదలైనవి ఉన్నాయి. ఈ  పోస్టులకు పని స్వభావాన్ని బట్టి  7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా అర్హతలను నిర్ణయించారు. వీటికి అప్లై చేసే వారి వయసు 42 ఏళ్లకు మించకూడదు. అప్లికేషన్లను డిసెంబరు 30లోగా ‘‘ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు’’ అడ్రస్‌కు పంపాలి. మరిన్ని వివరాలకు https://guntur.ap.gov.in/ వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

ఉచితంగా సాంకేతిక శిక్షణ

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌‌లో ఉన్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచితంగా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ కోర్సులలో ట్రైనింగ్ పొందొచ్చు. ఎంపికయ్యే వారికి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో ఉన్న సంస్థ క్యాంపస్‌లో ఉచిత ట్రైనింగ్ ఇస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్ టైంలో ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఫొటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి. జనవరి 2వ తేదీలోగా అడ్మిషన్ తీసుకోవచ్చు.వివరాలకు https://www.srtri.com/index.php వెబ్‌సైట్‌ను చూడొచ్చు.

కోర్సులు, అర్హతలు ఇవీ.. 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన బేసిక్‌ కంప్యూటర్స్‌ కోర్సులో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఇంటర్‌ చేసిన వారు అప్లై చేయొచ్చు.
  •  ట్యాలీకి సంబంధించిన అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కోర్సులో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. బీకాం చేసినవారు అప్లై చేయొచ్చు.
  • కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్‌ కోర్సులో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ఇంటర్‌ చేసినవారు అప్లై చేయొచ్చు.
  • ఆటోమొబైల్‌- టూ వీలర్‌ సర్వీసింగ్‌ కోర్సులో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పదోతరగతి చేసినవారు అప్లై చేయొచ్చు.
  • సెల్‌ఫోన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ రిపేర్‌ కోర్సులో 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పదోతరగతి చేసినవారు అప్లై చేయొచ్చు.
  • ఎలక్ట్రీషియన్‌ (డొమెస్టిక్‌) కోర్సులో  5 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పదోతరగతి, ఐటీఐ చేసినవారు అప్లై చేయొచ్చు.
  • సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్‌ అండ్ సర్వీస్‌ కోర్సులో 4 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. పదోతరగతి, ఐటీఐ చేసినవారు అప్లై చేయొచ్చు.

Also Read: WhatsApp Alert : వాళ్లకు వాట్సాప్‌ ‘స్క్రీన్ షేర్’ చేశారో అంతే సంగతులు!

  Last Updated: 26 Dec 2023, 02:12 PM IST