Theatres Seize in AP : హీరోల ‘ఆట‌’పై జ‌’గ‌న్‌’ థియేట‌ర్ల క్లోజ్..సీజ్!

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో టాలీవుడ్ రెండుగా చీలిపోయింది. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర్మాత న‌ట్టి కుమార్ అండ్ బ్యాచ్ మ‌ద్ధ‌తు ప‌లుకుతోంది. హీరోలు నాని, ప‌వ‌న్ అండ్ టీం ఏపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌డుతోంది. సినిమా థియేట‌ర్ల కంటే కిరాణా దుకాణాల క‌లెక్ష‌న్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని హీరో నాని చేసిన కామెంట్ల‌పై న‌ట్టి కుమార్ మండిప‌డ్డారు.

  • Written By:
  • Updated On - December 23, 2021 / 05:49 PM IST

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో టాలీవుడ్ రెండుగా చీలిపోయింది. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల‌కు నిర్మాత న‌ట్టి కుమార్ అండ్ బ్యాచ్ మ‌ద్ధ‌తు ప‌లుకుతోంది. హీరోలు నాని, ప‌వ‌న్ అండ్ టీం ఏపీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుబ‌డుతోంది. సినిమా థియేట‌ర్ల కంటే కిరాణా దుకాణాల క‌లెక్ష‌న్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని హీరో నాని చేసిన కామెంట్ల‌పై న‌ట్టి కుమార్ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరుతున్నాడు.
శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం మీడియా స‌మావేశం నిర్వ‌హించిన సంద‌ర్భంగా హీరో నాని చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం అయ్యాయి. వాటిపైన మంత్రి బొత్సాతో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌లోని కొంద‌రు రియాక్ట్ అయ్యారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా హీరో నాని మాట్లాడుతున్నార‌ని న‌ట్టి ఫైర్ అయ్యాడు. ఆ క్ర‌మంలో బీమ్లా నాయ‌క్ వెనుక్కు వెళ్ల‌గా, త్రిబుల్ ఆర్ సందిగ్ధంలో ప‌డింది. ఆచార్య వేచిచూస్తుండ‌గా, శ్యామ్ సింగరాయ్ త‌డ‌బ‌డుతోంది.

సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జీవో నెంబ‌ర్ 35 ను వ్య‌తిరేకిస్తూ కొంద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు హైకోర్టుకు వెళ్లారు. సింగిల్ జ‌డ్జి ఆ జీవోను కొట్టివేయ‌గా, డివిజ‌న్ బెంచ్ త‌ద్భిన్నంగా తీర్పు ఇచ్చింది. ఆ ప్ర‌కారం టిక్కెట్ ధ‌రను, ఆన్ లైన్ విధానాన్ని ఏపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోంది. ఏపీఎఫ్‌డీసీ ఆధ్వ‌ర్యంలో టిక్కెట్ల ఆన్ లైన్ అమ్మ‌కాల‌ను నిర్వ‌హించ‌డానికి సిద్దం అయింది.
నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్వ‌హిస్తోన్న థియేట‌ర్ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ కొర‌ఢా ఝుళిపించింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ‌గా తినుబండారాలు విక్ర‌యించ‌డాన్ని గుర్తించింది. థియేట‌ర్లు అప‌రిశుభ్రంగా ఉండ‌డంపై ఆగ్ర‌హించింది. దీంతో ఏకంగా తూర్పు గోదావ‌రి జిల్లాలోని 50 థియేట‌ర్ల‌ను స్వ‌చ్చంధంగా మూసివేశారు. చిత్తూరు జిల్లాతో స‌హా ప‌లుచోట్ల 10 థియేట‌ర్ల‌ను గురువారం సీజ్ చేయ‌డం జ‌రిగింది. దీంతో రాష్ట్ర‌ వ్యాప్తంగా థియేట‌ర్ల మూసివేత‌కు యాజ‌మాన్యాలు పిలుపునివ్వ‌డం గ‌మనార్హం.

Theatres Seize

సినిమా క‌లెక్ష‌న్ల ఆధారంగా హీరో, డైరెక్ట‌ర్ రెమ్యునేష‌న్ ఉంటుంది. అందుకే, కొంద‌రు మాఫీగా ఏర్ప‌డి పెద్ద హీరోల సినిమాల‌కు థియేట‌ర్ల‌ను బ్లాక్ చేస్తున్నారు. తొలి వారంలో ధ‌ర‌ల‌ను ఇష్టానుసారంగా పెంచడం ద్వారా క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్నారు. వాళ్లే నిర్మాత‌లు..వాళ్లే హీరోలు..వాళ్లే ఎగ్జిబిట‌ర్లు..వాళ్లే థియేట‌ర్ల య‌జ‌మానులుగా ఉంటూ..శాసిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితి మీద చాలా సంద‌ర్భాల్లో చిన్న సినిమా న‌టులు ఆందోళ‌న చేశారు. కానీ, ప‌రిష్కారం ల‌భించ‌లేదు.సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విధానం పెట్టాల‌ని హీరో చిరంజీవి, నాగార్జున అండ్ టీం తొలిసారి క‌లిసిన‌ప్పుడు సీఎం జ‌గ‌న్ ను కోరింది. ఆ మేర‌కు క‌స‌ర‌త్తు చేసిన ఏపీ ప్ర‌భుత్వం ఐఆర్ సీటీసీ త‌ర‌హాలో ఆన్ లైన్ టిక్కెట్ విధానం ప్ర‌వేశ‌పెట్టింది. దానిపై టాలీవుడ్ భిన్నంగా స్పందిస్తోంది. దిల్ రాజు, న‌ట్టికుమార్ ,నాగార్జున‌, చిరంజీవి లాంటి వాళ్లు జ‌గ‌న్ స‌ర్కార్ తో ట‌చ్ లో ఉన్నారు. వాళ్ల స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని మంత్రి పేర్ని నాని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టాడు.

Theatres in AP : ఏపీ ధియేట‌ర్ల‌లో ఇంత అరాచ‌క‌మా?

జ‌నసేనాని ప‌వ‌న్ మాత్రం జ‌గ‌న్ స‌ర్కార్ ఆన్ లైన్ విధానంపై ఫైర్ అవుతున్నాడు. సినిమాల‌ను ఉచితంగా ఆడిస్తానంటూ ఇటీవ‌ల హూంక‌రించాడు. జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్నంత వ‌ర‌కు ఓటీటీల్లోనే సినిమాను విడుద‌ల చేస్తానంటూ ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు ప్ర‌క‌టించాడు. హీరో బాల‌క్రిష్ణ మాత్రం ఇలాంటి అంశాల‌ను లైట్ గా తీసుకుని థియేట‌ర్ల లో అఖండ విజ‌యం సాధించాడు.
ఆన్ లైన్ ప‌ద్ధ‌తి, టిక్కెట్ల ధ‌ర నిర్థార‌ణ‌, థియేట‌ర్ల త‌నిఖీలు న‌చ్చ‌ని సినీ వ‌ర్గాలు జ‌గ‌న్ స‌ర్కార్ మీద విరుచుకుప‌డుతుండ‌గా..పెద్ద హీరోలు, నిర్మాత‌లు కొంద‌రు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం కార‌ణంగా టాలీవుడ్ లోని విభేదాలు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చాయి. థియేట‌ర్ల సీజ్ ఒక వైపు స్వ‌చ్చంధ మూసివేత మ‌రోవైపు ఏపీలో కొన‌సాగుతోంది. దీంతో రాష్ట్రం విడిపోయిన త‌రువాత తెలంగాణ‌కు జై కొడుతూ ఏపీకి దూరంగా ఉంటోన్న సినీ హీరోల ఆఖ‌రి `ఆట` హిట్టా..ఫ‌ట్టా చూద్దాం!