Site icon HashtagU Telugu

AP : వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటల్లో భయం కనిపిస్తుందే..!!

Ycp Fire Brands

Ycp Fire Brands

ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పోలింగ్ జరగడంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. పోలింగ్ పెరగడం ఏ పార్టీకి కలిసిరాబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూటమికే ప్రజలు మద్దతు పలికారని , రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని..ఈసారి కూటమి విజయాన్ని ఎవ్వరు ఆపలేరంటూ అంత భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మాటకు మాట..సవాల్ కు ప్రతి సవాల్ చేస్తూ ఘాటుగా విమర్శలు చేసే వీరు..ప్రస్తుతం భయం..భయంగా మాట్లాడడం..పరోక్షంగా కూటమి గెలవబోతుందంటూ చెప్పకనే చెపుతుండడం తో జనాలంతా ఫిక్స్ అవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అంటే కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ లు. వైసీపీ లో 151 మంది ఎమ్మెల్యేలు , పలువురు మంత్రులు ఉన్నప్పటికీ మీడియా లో మాత్రం ఈ నలుగురు మాత్రమే నిత్యం ప్రతిపక్షం ఫై , పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఈ ఫైర్ బ్రాండ్స్ ఎన్నికల్లో ఓటమి చెందబోతున్నారని అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం వీరి మాటల్లో భయమే. వీరి ఓటమి వీరి కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రోజా..తన ఓటమిని సొంత పార్టీ వారే కోరుకుంటున్నారని పోలింగ్ రోజే చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ , అంబటి రాంబాబు , కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతుంటే..వీరు కూడా లోలోపల ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో ఉన్నారని..అందుకే అప్పుడే ప్రతిపక్ష నేతలం అన్నట్లు వారంతా మీడియా ముందు మాట్లాడుతున్నారని వీరి మాటలు విన్న వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరు ఓటమి చెందుతారా..లేదా అనేది జూన్ 04 తెలుస్తుంది.

Read Also : Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?