వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లపై రగడ కొనసాగుతుంది. పార్టీపై అసంతృప్తితో కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. రెండో జాబితాలో ఎంతమందికి టికెట్లు ఉండవనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిచి టికెట్లపై స్పష్టత ఇస్తున్నారు. త్వరలోనే రెండో జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేయనుంది. రెండో జాబితాలో ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా కోనసీమలో ఎమ్మెల్యేల మార్పు ఎక్కువగా ఉంది. అమలాపురం నియోజకవర్గంలో మంత్రి విశ్వరూప్ కుటుంబంలోనే టికెట్ వార్ నడుస్తుంది. విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌కు అమలాపురం టికెట్లు కేటాయించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రి విశ్వరూప్ మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని తన కుమారుడికి ఇవ్వొద్దంటూ అధిష్టానంకి చెప్పినట్లు సమాచారం. చాలాచోట్ల తనకు కాకపోతే తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరుతుంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
సొంత కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంటే తండ్రి అడ్డుపడుతుండటం గమనర్హం. అమలాపురంలో విశ్వరూప్‌కే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గంలోని సీనియర్లు కోరుతున్నారు. ఆయన కుమారుడికి ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. కోనసీమలో జరిగిన అల్లర్లుకు తనకు ఎలాంటి సంబంధంలేదని.. తనపై నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి విశ్వరూప్ అంటున్నారు. అయితే గతంలో విశ్వరూప్ జనసేనకు అనూకలంగా ప్రకటనలు చేశారని అందుకోసమే ఆయనకు టికెట్ నిరాకరిస్తున్నట్లు వైసీపీలో వినిపిస్తుంది. విశ్వరూప్‌కు టికెట్ దక్కకపోతే పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. కుమారుడికి వైసీపీ టికెట్ ఇస్తే తండ్రి జనసేనలోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతుంది. మరి తండ్రికొడుకుల మధ్య సీటు పంచాయతిని వైసీపీ ఏ విధంగా డీల్ చేస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Water Supply: జనవరి 3న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్