Suicide: నాలుగో సారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య..!

వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన

Published By: HashtagU Telugu Desk
Suicide Hanging 19

Suicide Hanging 19

వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా శెట్టిహళ్లిలో జరిగింది. లోకేష్ అనే వ్యక్తి 8 సంవత్సరాల క్రితం శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. ఇటీవల మళ్లీ ఆడబిడ్డ పుట్టడంతో లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.. శెట్టిహళ్లి గ్రామానికి చెందిన లోకేష్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం శిరీష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇదివరకే ముగ్గరు ఆడపిల్లలు జన్మించారు. శిరీష మరోసారి గర్భం దాల్చి ఈ నెల 4వ తేదీన మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో లోకేష్‌ తీవ్ర ఆవేదన చెందాడు. తల్లి, తమ్ముడు ఇంట్లో లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి లోకేష్‌ తల్లిదండ్రులు, భార్య శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.

 

  Last Updated: 07 Nov 2022, 03:12 PM IST