Amaravathi : ప్రాంతీయ మండళ్లతో అమరావతి ఔట్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి ఏ మాత్రం తడబాటు లేకుండా పాలన దిశగా వెళ్తున్నాడు. మదిలో అనుకున్న ఆలోచన అమలు చేయడానికి సంకోచించడం లేదు.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 11:18 AM IST

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి ఏ మాత్రం తడబాటు లేకుండా పాలన దిశగా వెళ్తున్నాడు. మదిలో అనుకున్న ఆలోచన అమలు చేయడానికి సంకోచించడం లేదు. చాలా సందర్భాల్లో హైకోర్టు అభ్యంతరం తెలిపినప్పటికీ వెనకడగు వేయటం లేదు. ప్రజావేదిక కూల్చివేత నుంచి ప్రారంభం అయిన జగన్ పాలన ప్రత్యర్థుల దృష్టిలో బాగాలేదని విమర్శలు వచ్చినా ఆగటం లేదు. ఇసుక, లిక్కర్ పాలసీల నుంచి మూడు రాజధానులు వరకు ఆయన అనుకున్నది చేస్తున్నాడు. సంక్షేమ పధకాలను ఆపడం లేదు. కిందామీద పడుతూ ఏదో ఒక రకంగా అమలు చేస్తున్నాడు. ఎన్ని వివాదాలు చుట్టు ముడుతున్నా మీడియా ముందుకు రాకుండా మేనేజ్ చేస్తున్న సీఎం జగన్ స్టైల్ పాలన ఉద్యోగులు, విపక్షాలకు నచ్చడం లేదు.జిల్లాల సంఖ్యను పెంచుతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాడు. ఆ మేరకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చే వరకు వెళ్ళాడు. ఇక పూర్తి స్థాయిలో అమలు చేయడం మాత్రమే మిగిలింది. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. అభ్యంతరాలను తీసుకొని కొన్ని మార్పులు చేయడం ద్వారా జిల్లాలు 26 ఏర్పాటు జరుగుతుంది. పాలన సంస్కరణల్లో భాగంగా ఒక అడుగు మాత్రమే జగన్ వేసాడు. ఇంకా రెండు పెద్ద అడుగులు రాబోయే రోజుల్లో ఉన్నాయని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ రెండు నిర్ణయాలు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో పాలన సంస్కరణల వైపు తీసుకెళ్లనుంది. జిల్లాల ఏర్పాటు పూర్తి అయిన తరువాత ప్రాంతీయ మండళ్లు కు సంబందించిన నోటిఫికేషన్ రాబోతుందని సచివాలయ వర్గాల్లో టాక్. నాలుగు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర , విజయవాడ కేంద్రంగా సెంట్రల్ ఆంధ్ర, గుంటూరు కేంద్రంగా కోస్తాంధ్ర, కర్నూలు కేంద్రంగా రాయలసీమ బోర్డ్ ల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. నాలుగు మండళ్లకు నాలుగు బోర్డ్ లను ఏర్పాటు చేయనున్నారు. వాటికి ఛైర్మన్ హోదాలో సీనియర్ పొలిటీషియన్ కు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. నాలుగు బోర్డ్ లను ఏర్పాటు చేసిన తరువాత ఫైనల్ గా వాటిని విశాఖ రాజధానికి అనుసంధానం చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఆ దిశగా మూడు రాజధానుల బిల్లు ను సమగ్రంగా తీసుకు రావాలని సీరియస్ కసరత్తు జరుగుతుంది. ఆ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో పెట్టబోతున్నారు. అందుకే సమగ్ర బిల్లును మూడు రాజధానులపై ప్రవేశపెడతామని జగన్ చెప్పాడు. ఈ సారి మండలిలో కూడా ఈజీగా బిల్లు ఆమోదం పొందుతుంది. అక్కడ ప్రస్తుతం మండలి సభ్యులు వైసీపీ వాళ్లే ఎక్కువ ఉన్నారు. రాజ్యాంగ బద్దంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి అంతా సిద్దం అయింది. ఢిల్లీ లో కూడా జగన్ ఇటీవల వెళ్లిన సంధర్భంగా క్లీయరెన్సు తీసుకున్నాఢని టాక్. ఉగాది నుంచి కొత్త రాజధాని విశాఖ నుంచి పాలన సాగించడానికి జిల్లాల పెంపుతో సంస్కరణ ప్రారంభం అయింది. ఈ సారి కోర్ట్ కూడా తప్పు పట్టని విధంగా సమగ్ర బిల్లు రాబోతుంది. వచ్చే నెల 14 నుంచి బడ్జెట్ సమావేశాలు పెట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ఆ సమావేశాల్లో మూడు రాజదానులపై సమగ్ర బిల్లుకు ఆమోదం లభించనుంది. సో..జగన్ తాను అనుకున్న మూడు రాజదానుల అమలుకు జిల్లాల సంఖ్య పెంచడం పెద్ద ఎత్తుగడ అన్నమాట. అన్నీ జగన్ సర్కార్ భావిస్తున్నట్టు జరిగేతే ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పాలన సాగనుంది. సో..జగన్ పాలన సంస్కరణలు భవిష్యత్తులో ప్రత్యర్థులకు గిలిగింతలు పెట్టనుంది.