Capital Amaravathi : ‘అమ‌రావ‌తి’ రాజ‌ధాని ఎండ‌మావే.!

మూడు రాజ‌ధానుల‌కు వైసీపీ క‌ట్టుబ‌డి ఉంది. అమరావ‌తి ఏకైక రాజ‌ధాని ఏపీకి ఉండాల‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌రువాత కూడా జ‌గ‌న్ క్యాబినెట్లోని సీనియ‌ర్ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ అధికార వికేంద్ర‌క‌ర‌ణ మూడు రాజ‌ధానుల‌తోనే సాధ్య‌మ‌ని చెబుతున్నాడు.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 05:19 PM IST

మూడు రాజ‌ధానుల‌కు వైసీపీ క‌ట్టుబ‌డి ఉంది. అమరావ‌తి ఏకైక రాజ‌ధాని ఏపీకి ఉండాల‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌రువాత కూడా జ‌గ‌న్ క్యాబినెట్లోని సీనియ‌ర్ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ అధికార వికేంద్ర‌క‌ర‌ణ మూడు రాజ‌ధానుల‌తోనే సాధ్య‌మ‌ని చెబుతున్నాడు. అధికార‌, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని శ‌నివారం మ‌రోసారి వెల్ల‌డించాడు. మూడు రాజ‌ధానుల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని చెబుతున్నాడు. అయితే, ఏపీ ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు తీసుకుని మూడు రాజ‌ధానుల స‌మ‌గ్ర బిల్లు చేస్తామ‌ని వెల్ల‌డిస్తున్నాడు. అదెలా? అనే ప్ర‌శ్న ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతోంది. 2024 ఎన్నిక‌ల ఎజెండా ఫిక్స్ చేసి నిర్ణ‌యిస్తారా? లేక పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ల తీర్మానాల‌తో ఇప్పుడే చేస్తారా? జార్ఖండ్ త‌ర‌హాకు వెళ‌తారా? అనేది హాట్ టాపిక్ గా మారింది.న్యాయ‌ప‌రంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఈసారి మూడు రాజ‌ధానుల బిల్లు పెట్టాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ లోతుగా అధ్య‌య‌నం చేస్తోంది. ఆ విధంగా చేయాలంటే ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌ను న్యాయ నిపుణులు చెబుతున్నారు. వాటిలో ప్ర‌ధానంగా అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసే వారిని మూడు క్యాటగిరీలుగా విభ‌జించ‌డం ద్వారా న్యాయ చిక్కుల నుంచి త‌ప్పుకోవాల‌ని చూస్తున్నారు. సొంత భూమి ఉన్న వారిని “మొదటి రైతు” క్యాట‌గిరీ గానూ రాజ‌ధాని ప్రకటన త‌రువాత భూమి కొన్న వారిని “పెట్టుబడీదారు” గా భావిస్తూ రెండో కేటగిరీలోనూ, 29 గ్రామాల్లో భూమి లేని వాళ్ల‌ను “మద్దతుదారులు” మాదిరిగా గుర్తించి మూడో కేటగిరిగా విభ‌జించ‌బోతున్నార‌ని టాక్‌.

ఇలా మూడు ర‌కాలుగా విభజించిన రైతు, పెట్టుబడీదారు, మద్దతుదారు కేటగిరీల వాళ్ల‌కు తొలుత‌ గుర్తింపు కార్డులు ఇస్తారు. రైతుల‌తో తొలి విడ‌త ప్ర‌భుత్వం చ‌ర్చించాల‌ని భావిస్తోంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా ఎంత ధ‌ర భూమికి ఉంది, ఆ త‌రువాత రాజ‌ధాని ప్ర‌క‌ట‌న క్ర‌మంలో పెరిగిన ధ‌ర‌ను బేరీజు వేసి ఏదో ర‌కంగా సెటిల్ చేయాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తోంది. ఇక రెండో ర‌కంగా ఉన్న పెట్టుబ‌డిదారుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ద్వారా వ్యాపార వ‌ర్గాలుగా వాళ్ల‌ను ప‌రిగ‌ణించి లాభాపేక్ష‌తో వ‌చ్చిన వాళ్లుగా కోర్టుకు తెలియ‌చేయ‌బోతుంది. మూడో ర‌కం కింద ఉండే “మద్దతుదారుడు” రాజధాని అమరావతి వ‌ల్ల అత‌నికి వచ్చే లాభం ఏమిటని మూడు రాజధానులైతే వచ్చే నష్టం ఏమిటని అడుగుతారు. వాళ్ల అభ్యంతరాలని తెలుసుకుని పరిష్కారాలు పరిహారాలు అందిస్తారు. ఆ విధంగా మూడు ర‌కాలుగా 29 గ్రామాల‌కు చెందిన వాళ్ల‌ను వ‌ర్గీక‌రించి లిఖితపూర్వక అంగీకారాం లేదా వ్యతిరేకత తీసుకుంటారు. దాన్నే కోర్టులో అంద‌చేయ‌డానికి భారీ ప్లాన్ వేసింది. రాబోయే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ, కౌన్సిల్లోనే కాకుండా దాని ముసాయిదాని ప్రతీ కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ & జిల్లా పరిషత్ లకి పంపి ఆమోదముద్ర వేయించుకుంటారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు & కార్పోరేషన్లలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులచే మూడు రాజధానులకి ఆమోదం పొందినపుడు యావత్ రాష్ట్రం మూడు రాజధానులు కోరినట్టు అవుతుంది. రాష్ట్ర వ్యాప్త ప్రజా ప్రతినిధుల మద్దతు సమగ్ర నివేదిక కొత్త చట్టంలో అనుబంధ డాక్యుమెంట్ అవుతుంది. పైగా పంచాయ‌తీ నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందిన త‌రువాత న్యాయ వ్య‌వ‌స్థ‌లు ఏమీ చేయ‌లేవ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావ‌న‌. తిరుగులేని మోజార్టీ పంచాయ‌తీల నుంచి కౌన్సిల్‌, అసెంబ్లీ వ‌ర‌కు వైసీపీకి ఉంది. సో..బిల్లుకు ఆమోద‌ముద్ర వేయ‌డం చాలా తేలిక‌.

స‌మ‌గ్ర బిల్లు ఎపుడు పెడతారు ?
బడ్జెట్ సమావేశాల పిదప కొత్త ముసాయిదా బిల్లుని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఆమోదం కంటే ముందు ప్రజాభిప్రాయం కోసం స్థానిక సంస్థలకి పంపుతారు. వర్షాకాల సమావేశాలలోపు అన్ని స్థానిక సంస్థల చేత ఆమోదింప చేసుకుని జూలై ఆగస్టు నెలలలో అసెంబ్లీ ఆమోదం తీసుకుని కోన్సిల్ కి పంపి పూర్తి మెజారిటీతో ఆమోదించేలా భారీ స్కెచ్ జ‌గ‌న్ స‌ర్కార్ వేసింద‌ని తెలుస్తోంది. ఆ లోపుగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తాడు. సో..న్యాయ‌స్థానంలోనూ ఎలాంటి అడ్డంకులు ఉండ‌వ‌ని విశ్వసిస్తోంది. ఆ ధైర్యంతోనే ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయణ ఇప్ప‌టికీ మూడు రాజ‌ధానుల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెబుతున్నాడు. మూడు రాజ‌ధానులు ఏపీకి ఉండాల‌నేది జ‌గ‌న్ స‌ర్కార్ బ‌ల‌మైన నినాదం. ఈసారి త‌యారు చేసే స‌మ‌గ్ర‌ బిల్లుకు న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఏర్ప‌డితే, ప్ర‌త్యామ్నాయంగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఉంచుతూ ఉప రాజ‌ధానులుగా క‌ర్నూలు, విశాఖ‌ను ఉంచే ఆలోచ‌న కూడా ఉందని తెలుస్తోంది. ఆ త‌ర‌హా నిర్ణ‌యానికి న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉండే అవ‌కాశం లేదు. ఎందుకంటే, ఇప్ప‌టికే జార్ఖండ్ రాష్ట్రానికి న్యాయ‌స్థానాలు అనుమ‌తిని ఇచ్చాయి. సో..చివ‌రి ఆప్ష‌న్ గా ఉప రాజ‌ధానులను జ‌గ‌న్ స‌ర్కార్ పెట్టుకుంది. మొత్తం మీద అధికార వికేంద్రీక‌ర‌ణ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. అమ‌రావ‌తి ఏకైక రాజ‌ధాని అనే నినాదం జ‌గ‌న్ సీఎంగా ఉన్నంత వ‌ర‌కు ఎండ‌మావే.!