Amma Vodi : అక్క‌ర‌కు రాని అమ్మ ఒడి.. ఇదిగో సాక్ష్యం..

అనంత‌పురం జిల్లాలోని అనేక గ్రామాల్లో పాఠ‌శాల‌ల‌కు వేళ్లే పిల్ల‌లు వ్య‌వ‌సాయ కూలీ పనుల‌కు వెళ్తున్నారు.దీనికి ఆ విద్యార్థుల కుటుంబంలో పేద‌రికం కార‌ణంగానే జ‌రుగుతుంది. సీజ‌న్ లో మిర్చి కోయ‌డానికి, ప‌త్తి తీయ‌డానికి త‌మ‌తో పాటు త‌మ పిల్ల‌ల‌ను కూడా తీసుకెళ్ల‌డంలో వారికి ఆదాయం ఎక్కువ‌గా వ‌స్తుంది.

  • Written By:
  • Publish Date - December 13, 2021 / 05:19 PM IST

అనంత‌పురం జిల్లాలోని అనేక గ్రామాల్లో పాఠ‌శాల‌ల‌కు వేళ్లే పిల్ల‌లు వ్య‌వ‌సాయ కూలీ పనుల‌కు వెళ్తున్నారు.దీనికి ఆ విద్యార్థుల కుటుంబంలో పేద‌రికం కార‌ణంగానే జ‌రుగుతుంది. సీజ‌న్ లో మిర్చి కోయ‌డానికి, ప‌త్తి తీయ‌డానికి త‌మ‌తో పాటు త‌మ పిల్ల‌ల‌ను కూడా తీసుకెళ్ల‌డంలో వారికి ఆదాయం ఎక్కువ‌గా వ‌స్తుంది. ఒక్కో సీజ‌న్ కి వ‌చ్చే స‌రికి 9వేల రూపాయ‌ల వ‌ర‌కు వారికి వ‌స్తున్నాయి. అయితే ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన అమ్మ‌వ‌డి ప‌థ‌కంలో 75% హాజ‌రు త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో వారు అమ్మ‌వ‌డి ప‌థకాన్ని కోల్పోయే అవ‌కాశం ఉంది.

కర్ణాటక సరిహద్దులో ఉన్న పాఠశాలలు ఇటువంటి వాటికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హవలిగి K.S.Z.Pలో 565 మంది పిల్లలలో 20% మంది ప్ర‌స్తుతం ఉన్నారు. ఎక్కువ మంది విద్యార్థులను త‌ల్లిండ్రులు ఏదో చోట ప‌నికి పంపిస్తున్నారు.అయితే అమ్మ‌వ‌డి ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు పొందేందుకు 75% హాజ‌రు ఉండేలా చూడాల‌ని ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి వారంద‌ర‌నీ ఒప్పించినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వి.రాంభూపాల్ తెలిపారు.పంట‌లు పండే కాలంలో చాలా మంది పిల్ల‌ల‌ను పంట‌పోలాల్లో ప‌ని చేస్తున్న‌ట్లు తాము చూశామ‌ని ఆయ‌న తెలిపారు.
పెద్దవడగూరు మండలం కృష్టిపాడు వద్ద ఓ కుటుంబం మొత్తం పత్తి చేనులో పని చేస్తోందని…పిల్లలు బడికి వెళ్లకపోవడానికి గల కారణాన్ని కుటుంబ పెద్ద తిప్పేస్వామి తెలిపారు. రైతుతో పత్తి తీసి, గోనె సంచుల్లో ప్యాక్ చేసి దగ్గర్లోని లారీకి తీసుకెళ్లే ఒప్పందం కుదుర్చుకున్నాడని… కిలోకి రూ.17 చొప్పున కూలీ వ‌స్తుంద‌ని తెలిపారు.11 రోజుల పాటూ ప‌ని ఉంటుంద‌ని…ఈ పనికి కుటుంబంలోని ఒక్కొక్కరికి రోజుకి రూ. 400 వరకు వ‌స్తుంద‌న్నారు.

మ‌రోవైపు అమ్మ‌వ‌డి ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం కుటుంబంలో ఒక్క‌రికే వ‌స్తుండ‌టంతో త‌ల్లిదండ్రులు అబ్బాయిల‌ను ప‌థ‌కంలో చేర్చ‌డంతో త‌మ‌కు అమ్మ‌వ‌డి రావ‌డంలేద‌ని… దీంతో త‌మ‌ను ప‌నికి పంపుతున్నార‌ని అమ్మాయిలు అంటున్నారు.అందుకే ఎక్క‌డ చూసిన పొలాల్లో పని చేసే వారు అమ్మాయిలేఎక్కువగా కనిపిస్తారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులోని కుందుర్పి మండలం బెస్తరపల్లిలో 6 నుంచి 10వ తరగతి వరకు 213 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 180 మంది అమ్మ ఒడి ప్రయోజనాలు పొందుతున్నారు. పథకం ప్రయోజనం పొందలేని మరో 33 మందిలో 20 మంది అనారోగ్యం నుండి వికలాంగుల వరకు వివిధ కారణాల వల్ల గైర్హాజరయ్యారు, మరో 13 మంది కుటుంబాలు బెంగళూరు లేదా ఇతర పట్టణాలకు వలస వెళ్లిపోవడంతో చాలా కాలంగా గైర్హాజరయ్యారు.

అనంతపురం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలోని వివిధ పాఠశాలల్లో మొత్తం 629 మంది విద్యార్థులు 75% కంటే ఎక్కువ హాజరు కలిగి ఉన్నారు. అమ్మ‌వ‌డి పథకం కింద ఎవరూ నష్టపోలేదు. అయితే హాజరు నిబంధనను ప్రకటించడంతో గత 15 రోజులుగా పిల్లలు పాఠశాలకు హాజరయ్యారని పంచాయతీ కార్యదర్శి తుంపేర రెడ్డమ్మ తెలిపారు