రైతుల కోసం టీడీపీ.. జ‌గ‌న్ హ‌యాంలో వ్య‌వ‌సాయ సంక్షోభం

రైతు కోసం పోరాటాల‌కు టీడీపీ ప‌దును పెట్టింది. మిర్చి, ప‌త్తి, ట‌మోటా రైతులు న‌ష్ట‌పోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోక‌స్ చేసింది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోలేక‌పోతోంద‌ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెంనాయుడు మండిప‌డ్డారు

  • Written By:
  • Publish Date - September 23, 2021 / 01:41 PM IST

రైతు కోసం పోరాటాల‌కు టీడీపీ ప‌దును పెట్టింది. మిర్చి, ప‌త్తి, ట‌మోటా రైతులు న‌ష్ట‌పోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోక‌స్ చేసింది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోలేక‌పోతోంద‌ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెంనాయుడు మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చేత‌గానిత‌నం కార‌ణంగా రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లార‌ని గుర్తు చేశారు. కిలో ట‌మోటా రూ. 1 నుంచి రూ. 3లు ప‌చ్చి మిర్చి కిలో రూ. 3లకు మాత్ర‌మే ధ‌ర ఉంది. ప‌త్తి తేమ శాతం 12పైగా ఉంటే కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయ‌డంలేదు. ఫ‌లితంగా చిత్తూరు, క‌ర్నూలు, అనంత‌పురం రైతులు భారీగా న‌ష్ట‌పోయారు. ఆ విష‌యాన్ని టీడీపీ ఫోక‌స్ చేసింది.
ఏపీ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి కుర‌సాల కన్న‌బాబు, సీఎం జ‌గ‌న్ రైతుల క‌ష్టాలు, న‌ష్టాల గురించి తెలుసుకోవ‌డంలేద‌ని రైతు కోసం పోరాటంలో టీడీపీ ఆరోపించింది. వ్య‌వ‌సాయ పెట్టుబ‌డి, రాబ‌డికి మ‌ధ్య వ్య‌త్యాసం పెరిగిపోయింది.ఫ‌లితంగా రైతులు ప్ర‌తి ఏడాది భారీగా న‌ష్ట‌పోతున్నారు. గిట్టుబాటుగాని ధ‌ర‌ల‌తో వ్య‌వ‌సాయం చేయ‌డానికి రైతులు భ‌య‌ప‌డి పోతున్నారు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు అందుతోన్న స‌హాయ‌స‌హ‌కారాలు అంతంత మాత్ర‌మే. ఇలాగే ప‌రిస్థితులు కొన‌సాగితే, రాబోయే రోజుల్లో వ్య‌వ‌సాయం చేసే రైతులు ఉండ‌రు. ఇప్ప‌టికే చాలా మంది రైతులు గ్రామాలు వ‌ద‌లి ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వ్య‌వ‌సాయేత‌ర ప‌నులు చేసుకోవ‌డానికి మొగ్గుచూపుతున్నారు.
ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి కింద 3వేల కోట్ల రూపాయాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేటాయించింది. కానీ ఏ పంట‌కూ గిట్టుబాటు ధ‌ర ఇవ్వ‌లేక‌పోతోంది. పైగా మార్క్ ఫెడ్ లాంటి సంస్థ‌ల ఉనికిని ప్ర‌శ్నార్థం చేసింది. వ్య‌వ‌సాయ రుణాల‌ను బ్యాంకులు టార్గెట్ మేర‌కు ఇవ్వ‌డంలేదు. బ‌య‌ట అప్పుల‌తో రైతులు న‌ష్టాల భారీన ప‌డ్డారు. కోలుకోలేని విధంగా ప‌త్తి, మిర్చి, ట‌మోటా రైతులు న‌ష్ట‌పోయారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతుల గురించి ఆలోచిస్తుంద‌ని ఆశిద్దాం.