AP : క‌న్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వంద‌ల ఎక‌రాల్లో ఎండిపోయిన పంట‌

ఏపీలో రైతులు క‌న్నీరు పెడుతున్నారు. వ‌ర్షాలు లేక నీటి కొర‌త‌తో పంట‌లు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి

  • Written By:
  • Publish Date - November 2, 2023 / 08:27 AM IST

ఏపీలో రైతులు క‌న్నీరు పెడుతున్నారు. వ‌ర్షాలు లేక నీటి కొర‌త‌తో పంట‌లు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి కొరత, లోటు వర్షపాతం, కాలానుగుణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటికే 1,500 ఎకరాల్లో మిర్చి పంట ఎండిపోయింది. ఇదే పరిస్థితి మరో పదిరోజులు కొనసాగితే మిర్చి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే 1500 ఎకరాల్లో మిర్చి పంట ఎండియింద‌రి తెలిపారు. ఉద్యాన కమిషనరేట్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పంట ఎండిపోయిన వివరాలను ప్రభుత్వానికి పంపారు. ప్రత్తిపాడు, పొన్నూరు, చెర్బోలు, అమరావతి, క్రోసూరు, సత్తెనపల్లి, వినుకొండ, దాచేపల్లి, నరసరావుపేట, గురజాల, బాపట్ల, కొల్లూరు, కొల్లిపర మండలాల్లో పంట ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కృష్ణా నది నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా బ్యారేజీ, పట్టిసీమ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ రైతులు మోటార్లు పెట్టి వ్యవసాయ పొలాలకు నీటిని మళ్లించి పంటలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిర్చి పంట ఎండిపోయి దెబ్బతింటుందని మిర్చి రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read:  Chandrababu : చంద్రబాబు ఇంటికి ఏఐజీ వైద్యుల బృందం