Tomato : టామ‌టా పంట‌తో 80ల‌క్ష‌లు సంపాదించిన రైతు… ఎక్క‌డో తెలుసా…?

పంట పండిచిన రైతుకు ఎప్పుడు మ‌ద్ద‌తు ధ‌ర‌ లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 25, 2021 / 04:13 PM IST

పంట పండిచిన రైతుకు ఎప్పుడు మ‌ద్ద‌తు ధ‌ర‌ లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. మంచి డిమాండ్ ఉన్న పంట‌ల‌కు కూడా రైతుల ద‌గ్గ‌ర త‌క్కువ ధ‌ర‌కు కొని ద‌ళారులు ఎక్కువ ధ‌ర‌కు మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. అయితే ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ట‌మాట ధ‌ర మాత్రం ఆకాశ‌నంటుతుంది. ఈ స‌మ‌యంలో ట‌మాట పండించిన రైతుల ఇంట కాసుల వ‌ర్షం కురుస్తుంది.గత ఇర‌వై రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కూర‌గాయ‌ల పంట‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. అయితే చాలా చోట్ల వ‌ర్షాల‌కు పంట దెబ్బ‌తిన్న కొన్ని చోట్ల మాత్రం ట‌మాట పంట దిగుబ‌డి అధికంగా ఉంది. ఏపీలో ప్ర‌ధానంగా చిత్తూరు,క‌ర్నూల్ జిల్లాలో ట‌మాట సాగు అధికంగా ఉంది.అయితే గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు కొంత‌మేర పంట దెబ్బ‌తింది.

ఈ నేప‌థ్యంలో టమాట ధ‌ర అమాంతం పెరిగిపోయింది. గ‌త రెండు నెల‌లుగా 50 నుంచి ఇప్పుడు 130 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగింది. చాలా మంది ప్ర‌జ‌లు ట‌మాటాలు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు. అయితే రైతులు మాత్రం ట‌మాట పంట‌కి ఇంత అధిక ధ‌ర రావ‌డంతో వారంతా ఆనందంగా ఉన్నారు.ఈ స‌మ‌యంలోనే క‌ర్నూల్ జిల్లాలో ఓ రైతు జాక్ పాట్ కొట్టాడు. కొడుమూరు మండ‌లం ప్యాల‌కుర్తికి చెందిన రైతు మ‌హమ్మ‌ద్ ర‌ఫీ త‌న కుటుంబానికి ఉన్న 100 ఎక‌రాల్లో 40 ఎక‌రాలు ట‌మాట పంట సాగు చేశాడు. ర‌ఫీ ఆయ‌న ఇద్ద‌రు సోద‌రులు క‌లిసి మొత్తం 40 ఎక‌రాల్లో ట‌మాటని సాగు చేశారు. అయితే ఎక‌రాకి రెండు ల‌క్ష‌లు చోప్పున 80 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చింది.రానున్న రోజుల్లో ఆదాయం మరింత పెరుగుతుంద‌ని రైతు ర‌ఫీ అంటున్నారు.