Site icon HashtagU Telugu

Indrakeeladri : దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం కోసం అమ్మ ద‌య ఉన్న‌.. అధికారుల ద‌య ఉండాల్సిందేనా..?

durga temple

durga temple

విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై దస‌రా ఉత్స‌వాల్లో అధికారులు అత్యూత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే సామాన్య భ‌క్తులు ఇబ్బందులు గుర‌వుతున్నారు.ఆల‌య అధికారులు, సిబ్బంది వీఐపీల సేవ‌లో త‌రిస్తున్నారు. గ‌తంలో కంటే భిన్నంగా ఈ సారి ఆల‌యంలో ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. సామాన్య భ‌క్తుల‌కే అమ్మ‌వారి ద‌ర్శ‌నం అంటూ అధికారులు చెప్తున్న‌ప్ప‌టికి వీఐపీల తాకిడి ఎక్కువ‌గానే ఉంది. ఇటు న‌కిలీ పాసులు ఆల‌యంలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఆల‌యంలో వీఐపీ పాసులు, మీడియా పాసుల‌తో చాలా మంది ద‌ర్శ‌నానికి వ‌స్తున్నారు. అయితే వీఐపీ పాసులు ప‌రిమిత సంఖ్య‌లోనే రిలీజ్ చేసిన ఆల‌య అధికారులు.. వాటి కంటే ఎక్కువ సంఖ్య‌లో వీఐపీ పాసులు తీసుకుని భ‌క్తులు ద‌ర్శ‌నానికి వస్తున్నారు. ఇటు ఆల‌యంలో ద‌ళారులు కూడా విచ్చ‌ల‌విడిగా టికెట్లు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండు రోజుల క్రితం ఆల‌యంలో న‌కిలీ పాసులు క‌ల‌కలం రేపాయి. రూ. 500 టిక్కెట్ చెక్కింగ్ వద్ద నకిలీ పాసులతో వెళ్తున్న వారిని ఆల‌య‌ సిబ్బంది గుర్తించారు.  న‌కిలీ పాసుగా గుర్తించ‌డంతో వారిని క్యూలైన్లోనే సిబ్బంది అడ్డుకున్నారు. అడ్డుకున్న సిబ్బందిపై తల్లి కొడుకులు వాగ్వాదానికి దిగారు మీ అంత చూస్తానని సిబ్బందిని స‌ద‌రు మహిళ బెదిరించింది. ట్రస్ట్ బోర్డు మెంబర్ రాంబాబు పేరు చెప్పి సిబ్బందికి మ‌హిళ బెదిరించ‌డంతో ఆల‌య సిబ్బంది ఖంగుతిన్నారు. వివాదం ముద‌ర‌డంతో పోలీసుల రంగప్రవేశం చేసి మ‌హిళ‌ని అక్క‌డి నుంచి పంపించి వేశారు. దుర్గ‌మ్మ స‌న్నిధిలో నకిలీ పాసుల వ్యవహారంపై ఆల‌య అధికారుల‌కు సిబ్బంది ఫిర్యాదు చేయ‌నున్నారు. అయితే ఆల‌యంలో కొంత‌మంది సిబ్బంది, ఇత‌ర అధికారుల ప్ర‌మేయంతోనే న‌కిలీ పాసులు వ‌చ్చాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పోలీస్ అధికారులు వారికి సంబంధించిన బంధువుల‌ను కొండ‌పైకి వాహ‌నాల్లో త‌ర‌లిస్తూ క్యూలైన్లో అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి పంపిస్తున్నారనే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఏదీ ఎమైనా కొండ‌పై అమ్మ ద‌య ఉన్నా.. అధికారుల ద‌య ఉంటేనే అమ్మ‌వారి ద‌ర్శ‌నం త్వ‌ర‌గా అవుతుంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది.

Also Read:  Indrakeeladri : కుటుంబ‌స‌మేతంగా బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ని ద‌ర్శించుకున్న ఎంపీ కేశినేని నాని