Site icon HashtagU Telugu

Fake Currency : చాపకింద నీరులా తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నోట్ల దందా..!

Fake Currency

Fake Currency

Fake Currency : దేశంలో నకిలీ నోట్ల (Fake Currency) సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. “ధనం మూలం ఇదం జగత్” అనే సామెత ప్రకారం, ఆధునిక కాలంలో ప్రతి కార్యకలాపం డబ్బుతోనే ముడిపడి ఉంది. అయితే, ఈ డబ్బు పిచ్చి, సులభంగా సంపాదించాలనే ఆలోచన కొన్ని వ్యక్తులను మోసపూరిత మార్గాల్లోకి నడిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్న వ్యాపారులు, ఆర్థికంగా క్షీణించి ఉన్న వారు ఈ మోసగాళ్ల ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఎక్కడోఒక చోట దొంగ నోట్ల బాగోతం వెలుగులోకి వస్తోంది.

ఈ మోసగాళ్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులను టార్గెట్ చేస్తారు. పెద్ద మొత్తంలో నగదు అవసరం ఉన్నవారిని గుర్తించి, సులభంగా డబ్బు వచ్చేలా ఆశ చూపుతారు. మొదట కొంతమొత్తం పెట్టుబడి పెట్టాలని కోరుతూ, బాధితులను తమ ఉచ్చులోకి లాగుతారు. అనంతరం నగదు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు తదితర రూపాలలో బాధితుల వద్ద ఉన్న ఆస్తులను దోచుకుంటారు.

YS Jagan : జగన్‌కు ఊరట.. అక్రమాస్తుల కేసుల బదిలీకి ‘సుప్రీం’ నో.. రఘురామ పిటిషన్‌ వెనక్కి

ఏపీలో తాజా ఘటన.. గుంటూరు జిల్లాలో కలకలం
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనతో నకిలీ నోట్ల వ్యాపారం మళ్లీ చురుగ్గా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కుంచనపల్లి బ్యాంక్ ఘటన
కుంచనపల్లి గ్రామంలోని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో నకిలీ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే వ్యక్తి ఈ ఏటీఎంలో రూ. 50,000 నగదు డిపాజిట్ చేశాడు. అయితే, బ్యాంకు అధికారులు ఆ డిపాజిట్‌లో రూ. 18,000 నకిలీ నోట్లుగా గుర్తించారు.

బ్యాంక్ అధికారుల ఫిర్యాదు
అంజిబాబు చేసిన డిపాజిట్‌లో దొంగ నోట్లు ఉండటంతో బ్యాంక్ అధికారులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాడేపల్లి పోలీసులు ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అంజిబాబుకు ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అతనికి డబ్బులు అందించిన వ్యక్తులు ఎవరూ? వీరికి ఈ నోట్ల మూలం ఎక్కడ? వంటి కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఈ ఘటనతో మరోసారి నగరంలో నకిలీ నోట్లు ఎలా చలామణి అవుతున్నాయో వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు వీటికి శిక్షణ లేని మోసగాళ్ల బలైపోతున్నారు. ఆర్‌బీఐ సహా సంబంధిత సంస్థలు దీనిపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.

ఇలాంటి మోసాలు తక్షణమే అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు నకిలీ నోట్ల గురించి అవగాహన కలిగి ఉండి, డబ్బు తీసుకోవడం, డిపాజిట్ చేయడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారుల సూచనలను పాటించి, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను వెంటనే పోలీసులకు తెలియజేయడం ద్వారా ఇలాంటి మోసాలను అరికట్టడం సాధ్యం.

Hari Hara Veera Mallu : మేకర్స్‌ ఇలా చేశారేంటీ… గందరగోళంలో పవన్‌ ఫ్యాన్స్‌..!