TDP : చంద్ర‌బాబు కొంప‌ముంచుతున్న టీడీపీ సోష‌ల్ మీడియా

తెలుగుదేశం అధినేత‌కి సోష‌ల్ మీడియా త‌ల‌పోటుగా మారింది. ఐటీడీపీ అంటూ సోష‌ల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసిన

  • Written By:
  • Updated On - June 10, 2023 / 07:25 AM IST

తెలుగుదేశం అధినేత‌కి సోష‌ల్ మీడియా త‌ల‌పోటుగా మారింది. ఐటీడీపీ అంటూ సోష‌ల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ దాని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది. ఐటీడీపీ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఒక‌టైతే.. గ్రౌండ్ లెవ‌ల్‌లో ఐటీడీపీ చేస్తుంది మ‌రొక‌టిలా ఉంది. ఏపీలో అధికార వైసీపీ సోష‌ల్ మీడియా బ‌లంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోవ‌డానికి అధికార పార్టీ సోష‌ల్ మీడియా కూడా ఒక కార‌ణంగా ఉంది. దానిని ఢీ కొట్టాల‌ని అధినేత చంద్ర‌బాబు ఐటీడీపీ పేరుతో సోష‌ల్ మీడియాని ఏర్పాటు చేశారు. కానీ ఈ విభాగం అధికార పార్టీ మీద‌కంటే సొంత పార్టీ నేత‌ల‌పై పోస్టింగ్‌లు, వీడియోలు పెడుతుంది. దీనిలో ప‌ద‌వులు కూడా పార్టీ కోసం ఎన్నడూ ప‌ని చేయ‌ని వారికి ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ముక్కు మోహం తెలియ‌ని వారిని తీసుకువ‌చ్చి ఐటీడీపీ క‌న్వీన‌ర్ అంటూ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. ఐటీడీపీలో ప‌ద‌వులు పొందిన వారు క‌నీసం అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు ఎక్క‌డా ప్ర‌స్తావించిన దాఖ‌లాలు లేవు.

ఇటు ఐటీడీపీలో రాష్ట్ర‌స్థాయిలో ఉన్న వారు వైసీపీకి కోవ‌ర్టుగా ప‌ని చేస్తున్నార‌ని జైలుకు వెళ్లిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు రాస్తున్నారు. ఓ మ‌హిళా ఐటీడీపీ ప్ర‌తినిధిపై ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. ప‌ద‌వులు లేని టీడీపీ కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో అధికార పార్టీపై పోస్టింగ్‌లు పెట్టి జైలుకు వెళ్తే… ప‌దువులు ఉన్న వారు మాత్రం రాష్ట్ర పార్టీ ఆఫీస్ వెంట తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నార‌ని కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు. నిన్న జ‌రిగిన సోష‌ల్ మీడియా అభినంద‌న స‌భ‌లో సైతం ఐటీడీపీతో సంబంధం లేని వారిని తీసుకువ‌చ్చి చంద్ర‌బాబుతో స‌న్మానం చేయించార‌ని క్యాడ‌ర్ ఆరోపిస్తుంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న టీడీపీ సోష‌ల్ మీడియా మాత్రం అధికార పార్టీపై ఏ మాత్రం పోరాటం చేయ‌డం లేద‌నే భావ‌న‌లో సొంతపార్టీ క్యాడ‌ర్ ఉంది. ఇదే విధంగా కొన‌సాగితే తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ పెద్ద త‌ల‌నొప్పిగానే మారుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.