Fact Checked By news meter
క్లెయిమ్ : 2025 ఏప్రిల్ 1 నుంచి రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై 1.1 శాతం మేర పన్ను విధిస్తారు.
వాస్తవం: ఈ ప్రచారం తప్పు. 1.1 శాతం పన్ను అనేది కేవలం PPI వ్యాపార లావాదేవీలకు వర్తిస్తుంది. బ్యాంక్ టు బ్యాంక్ డబ్బు బదిలీలకు ఇది వర్తించదు.
సోషల్ మీడియా పోస్ట్‌లో ఏముంది ?
యూపీఐ లావాదేవీలు మనదేశంలో బాగా పెరుగుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. ఈ పరిణామం మనదేశంలో పెరిగిన డిజిటల్ అక్షరాస్యతకు నిదర్శనం. అయితే 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలపై 1.1 శాతం పన్ను విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక X వినియోగదారుడు సోషల్ మీడియాలో.. “ఏప్రిల్ 1 నుంచి.. మీరు రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని Google Pay(Fact Check), ఫోన్ పే లేదా ఏదైనా ఇతర UPI ద్వారా బదిలీ చేస్తే 1.1 శాతం పన్ను విధిస్తారు. ఉదాహరణకు మీరు ఎవరికైనా రూ. 10,000 పంపితే రూ. 110 పన్నుగా తీసివేస్తారు’’ అని రాశారు.
వాస్తవాలు ఇవీ..
- సోషల్ మీడియా యూజర్ చేస్తున్న ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. రూ. 2,000కు పైబడిన పీపీఐ వ్యాపార లావాదేవీలపై మాత్రమే 1.1 శాతం పన్ను వర్తిస్తుంది. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIలు) అంటే.. కస్టమర్లు వాలెట్‌లో డబ్బును నిల్వ చేయడానికి, లావాదేవీలను నిర్వహించడానికి అనుమతించే టూల్స్.
- యూపీఐ లావాదేవీలపై పన్ను గురించి TV9 తెలుగు బులెటిన్‌ను కూడా సదరు ఎక్స్ యూజర్ షేర్ చేశాడు. వ్యాలెట్లు, కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులపై మాత్రమే 1.1 శాతం పన్ను వర్తిస్తుందని టీవీ9 బులెటిన్‌లో స్పష్టంగా ప్రస్తావించారు.
- మేం కీవర్డ్ సెర్చ్ ద్వారా ఈ అంశంపై ‘ది హిందూ’ పబ్లిష్ చేసిన న్యూస్ రిపోర్టును తీశాం. దానిలోనూ ‘రూ.2,000 కంటే ఎక్కువ PPI వ్యాపార లావాదేవీలపై 2025 ఏప్రిల్ 1 నుంచి 1.1% ఛార్జీ’ అని టైటిల్ పెట్టారు. ఈ వార్త 2023 మార్చి 30న పబ్లిష్ అయింది.
- కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్ చెక్ ద్వారా 2023 మార్చి 29న షేర్ చేసిన ఒక పోస్ట్‌ను కూడా మేం గుర్తించాం. అది కూడా ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.
.@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck
➡️There is no charge on normal UPI transactions.➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj
— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023
Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఈరోజు నుంచి డిసెంబరు 21 వరకు వీక్లీ రాశిఫలాలు
- 2024 ఆగస్ట్ 21న Fi Money యూపీఐ లావాదేవీలపై ప్రచురించిన నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన NPCI సంస్థ పరిధిలో యూపీఐ లావాదేవీలు ఉంటాయి. ఎన్‌పీసీఐ ప్రకారం.. కేవలం PhonePe లేదా Paytm వాలెట్ల వంటి ప్రీపెయిడ్ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకు నుంచి బ్యాంక్ బదిలీలకు ఛార్జీలు వర్తించవు. ప్రీ-పెయిడ్ వాలెట్‌కు డబ్బును జోడించడం కోసం రుసుమును వసూలు చేస్తారు. ప్రీపెయిడ్ వాలెట్లతో ముడిపడిన లావాదేవీలు రూ.2వేలు దాటితే 1.1 శాతం పన్ను వర్తిస్తుంది. యూపీఐ లావాదేవీలకు ఈ ట్యాక్స్ వర్తించదు.