Site icon HashtagU Telugu

Fact Check : వక్ఫ్ బోర్డును ఏపీ సర్కారు రద్దు చేసిందా ? నిజం ఏమిటో తెలుసుకోండి

Has The Ap Government Abolished The Waqf Board Know What Is True

Fact Checked By NewsMeter

క్లెయిమ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది.

వాస్తవం:  తప్పుదోవ పట్టించే ప్రచారం ఇది.  చట్టపరమైన, అడ్మినిస్ట్రేటివ్, ప్రాతినిధ్య సమస్యల కారణంగా వక్ఫ్ బోర్డును రద్దు చేసింది.  త్వరలో కొత్తదాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఏపీ సర్కారు ఉంది. 

వాదన ఇదీ.. 

వక్ఫ్ (సవరణ) బిల్లుపై  జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పదవీకాలాన్ని 2025లో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు పొడిగించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో జరుగుతాయి. జేపీసీ పదవీ కాలాన్ని పొడిగించాలని 2024 నవంబర్ 28న ఈ కమిటీ ఛైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ చేసిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ బోర్డును రద్దు చేశారంటూ తప్పుడు ప్రచారం(Fact Check) జరిగింది.

Also Read :Puri Musings : ‘‘లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి ?’’ పూరి జగన్నాథ్ సూపర్ టీచింగ్స్

బీజేపీకి చెందిన అమిత్ మాలవ్య సహా పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది’ అని ఉన్న ‘టైమ్స్ నౌ’ బ్రేకింగ్ న్యూస్ హెడ్‌లైన్‌తో డిసెంబర్ 1న అమిత్ మాలవ్య ఒక ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది. లౌకిక భారతదేశంలో దాని ఉనికిని సమర్థించే రాజ్యాంగపరమైన నిబంధన ఏదీ లేదు” అని ఆ వీడియోకు అమిత్  మాలవ్య క్యాప్షన్ రాశారు. (ఆర్కైవ్)

Also Read :New Ministers 2025 : ఆరుగురికి తెలంగాణ మంత్రులయ్యే భాగ్యం.. రేసులో ఎవరు ?

వాస్తవం ఇదీ.. 

ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ గుర్తించింది. ఏపీలో వక్ఫ్ బోర్డు రద్దు చేయబడింది కానీ.. శాశ్వతంగా దాన్ని రద్దు చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 11 మంది సభ్యులతో కూడిన వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే, వివిధ సమస్యల కారణంగా బోర్డు దీర్ఘకాలికంగా పనిచేయకపోవడాన్ని ఉటంకిస్తూ.. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈవివరాలతో టైమ్స్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1, 2024న కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి బోర్డును రద్దు చేస్తూ నవంబర్ 30న ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) జారీ అయింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఫాక్ట్ చెక్ వింగ్ డిసెంబర్ 1న X పోస్ట్ ద్వారా ఒక వివరణను జారీ చేసింది. ‘‘ఏపీ వక్ఫ్ బోర్డు 2023 మార్చి నుంచి పనిచేయడం లేదు. పరిపాలనా స్తబ్దత, చట్టపరమైన సవాళ్లను పరిష్కరించడానికి దాని రద్దు అవసరం. త్వరలో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తారు’’ అని ఆ పోస్ట్‌లో వెల్లడించింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)