Site icon HashtagU Telugu

AP : విజయవాడలో బాణసంచా దుకాణంలో పేలుడు..ఇద్దరు సజీవదహనం.!!

4 killed In Fire

Fire

ఏపీలోని విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. నగరంలో జింఖానా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునే ప్రయత్నం చేసినా విఫలమైంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు.

దీపావళి సందర్భంగా జింఖానా గ్రౌండ్ లో బాణాసంచా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. దీంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. దుకాణం పక్కనే పెట్రోలు బంక్ కూడా ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మూడు దుకాణాలు దగ్దమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.