Ex Navy Officer – Vizag – Qatar : ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నేవీ ఆఫీసర్లలో వైజాగ్‌వాసి.. ఎవరు ?

Ex Navy Officer - Vizag - Qatar : ఖతార్ కోర్టు.. భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష విధించిందనే వార్త  సంచలనం క్రియేట్ చేసింది.

  • Written By:
  • Updated On - October 27, 2023 / 02:17 PM IST

Ex Navy Officer – Vizag – Qatar : ఖతార్ కోర్టు.. భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష విధించిందనే వార్త  సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఉరిశిక్ష పడిన వారిలో వైజాగ్‌కు చెందిన మాజీ నేవీ అధికారి సుగుణాకర్ పాకాల కూడా ఉన్నారు. మరణశిక్ష వార్త విన్నప్పటి నుంచి సుగుణాకర్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావును కలిసి సాయం కోరారు. ఈ అభ్యర్థనను స్వీకరించిన జీవీఎల్.. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడారు. ఖతార్‌లోని భారత రాయబారితో కూడా ఈ అంశంపై సంప్రదింపులు జరిపారు. భారత మాజీ నేవీ అధికారులకు పడిన ఉరిశిక్షను ఆపేందుకు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాలన్నీ వాడుకోవాలని భారత విదేశాంగ శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఖతార్‌లో ఏమైంది ?

8 మంది  భారత మాజీ నేవీ అధికారులు 2022 ఆగస్టులో ఖతార్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిలో కమాండర్ పూర్ణేందు తివారి, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్‌ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కేప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కేప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కేప్టెన్ సౌరభ్ వశిష్ఠ్‌, సెయిలర్ రాగేశ్ గోప కుమార్ ఉన్నారు. వీళ్లందరికీ నేవీలో 20 ఏళ్ల సర్వీస్‌ రికార్డు ఉంది. ఖతార్‌లోని ప్రైవేట్ కంపెనీ దహ్ర్ గ్లోబల్ టెక్నాలజీస్‌లో ఈ ఎనిమిది మంది పనిచేసేవారు. ఈ కంపెనీ ఓనర్.. రాయల్ ఒమన్ ఎయిర్ ఫోర్స్‌కు  చెందిన రిటైర్డ్ స్వాడ్రన్ లీజర్ ఖమీస్ అల్ అజ్మీ. గతేడాది ఖమీస్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, వెంటనే విడుదల చేశారు. మిగతా 8 మంది మాత్రం జైల్లోనే ఉండిపోయారు. చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్‌పై వీళ్లంతా కలిసి పనిచేశారని తెలిసింది. ఖతార్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అరెస్టు చేసి గత ఏడాది కాలంగా జైలులో ఉంచి, న్యాయ విచారణ జరిపారు. ఖతార్‌‌కు చెందిన కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేస్తున్నారని(Ex Navy Officer – Vizag – Qatar) ఖతర్  ప్రభుత్వం మండిపడింది. ఇందువల్లే 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది.

Also Read: Li Keqiang: చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి