Site icon HashtagU Telugu

Pathapati Sarraju : క్ష‌త్రియ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్, మాజీ ఎమ్మెల్యే పాత‌పాటి స‌ర్రాజు మృతి

EX MLA Sarraju

EX MLA Sarraju

ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు(72) మ‌ర‌ణించారు. గత రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావ‌డంతో కుప్పకూలారు. వెంటనే ఆయనను భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

2004లో ఉండి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించిన స‌ర్రాజు.. 2009లో మళ్లీ కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా స‌ర్రాజు ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత 2014కు ముందు వైసీపీలో చేరి మళ్లీ ఉండి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయనకు టికెట్ దక్కలేదు.. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న‌కు క్ష‌త్రియ కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.