Site icon HashtagU Telugu

Ex MLA David Raju Died : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత

Ex Mla David Raju

Ex Mla David Raju

మాజీ MLA డేవిడ్ రాజు (Ex MLA David Raju)(66) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. సీనియ‌ర్ రాజ‌కీయ నేతైనా డేవిడ్ రాజు టీడీపీ (TDP) పార్టీ త‌ర‌ఫున జడ్పీ ఛైర్మన్ గా చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా కొన‌సాగారు. 2014లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జ‌గ‌న్ ఆద‌ర‌ణ‌తో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది తిరక్కుండానే గెలిపించిన పార్టీకి గుడ్ బై చెప్పి.. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడున్నరేళ్లు ఎమ్మెల్యే గా త‌న హవా నడిచింది. ఆయితే, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ డేవిడ్‌రాజుకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావ‌డంతో నామినేటెడ్‌ పదవి కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అనుకున్న‌ది ద‌క్క‌లేదు. దీంతో ఏమాత్రం ఆలోచించ‌కుండా, వేచి చూడ‌కుండా మ‌ళ్లీ టీడీపీ కండువా క‌ప్పేసుకున్నారు. ఇలా అటు, ఇటు జంపింగ్ చేస్తుండడం తో ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. కాగా గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..హైదరాబాద్ లో ఓ ప్రవైట్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ..ఆదివారం తుది శ్వాస విడిచారు.

Read Also : Gachibowli Stadium : ఇంటర్‌కాంటినెంటల్ కప్‌కు సిద్ధమైన గచ్చిబౌలి స్టేడియం