Site icon HashtagU Telugu

TDP vs YCP : ఆర్య‌వైశ్యుల‌కు నేనేమి చేసానో చ‌ర్చ‌కు సిద్ధం.. బాబు,లోకేష్‌, ప‌వ‌న్‌కు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి స‌వాల్‌

Vellampalli

Vellampalli

ఆర్య‌వైశ్యుల‌కు తానేమి చేసానో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ స‌వాల్ విసిరారు. త‌న స‌వాల్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు, నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రైనా స్వీక‌రించాల‌న్నారు. చ‌ర్చ‌కు టీడీపీ ఆఫీస్ కు రమ్మన్నా కూడా తాను సిద్ధమేన‌ని వెల్లంప‌ల్లి తెలిపారు. ఆర్య వైశ్య సంఘాల ముసుగులో త‌న‌ను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఆర్య వైశ్యులు కు ప్రాధాన్యత ఇవ్వలేదని.. జగన్ సీఎం అయ్యాక అనేక రాజకీయ, నామినేటెడ్ పదవుల‌ను ఆర్య‌వైశ్యుల‌కు ఇచ్చార‌ని వెల్లంప‌ల్లి తెలిపారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలకు పోలీసులు అడిగిన వివరాలు ఇవ్వలేదని.. కార్తిక పౌర్ణమి స్నానాల కోసం వేలాది మంది భక్తులు వచ్చే చోట వారికి ఇబ్బంది కలిగేలా  కార్యక్రమం తలపెట్టారని మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు,పవన్ కళ్యాణ్, బీజేపీ హిందూ ద్రోహులని.. టీడీపీ హయాంలో ఆలయాలు కూల్చివేస్తే బీజేపీ పట్టించుకోలేదన్నారు. ఆర్యవైశ్యులకు పెద్ద పీట వేస్తుంది సీఎం జ‌గ‌నేన‌ని తెలిపారు. గతంలో ఆర్యవైశ్యులను చంద్రబాబు ఎందుకు పట్టించు కోలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. చింతామని నాటకం జీవో రద్దు, వాసవి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది కూడా సీఎం జ‌గ‌నేన‌న్నారు. చందాల కోసం ఆర్యవైశ్యుల ముసుగులో రాజకీయ డ్రామాలాడతారా అంటూ టీడీపీ నేత‌ల‌పై వెల్లంప‌ల్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజయవాడ పశ్చిమ టిక్కెట్ వైశ్యులుకె ఇచ్చే దమ్ము లోకేష్ కి ఉందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోతిన మహేష్ కు సిగ్గు లేకుండా చంద్రబాబు కి చంచాగిరి చేస్తున్నార‌ని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇంఛార్జిని పెట్టలేని దద్దమ్మలు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Also Read:  AP : నేటి నుంచి ఏపీలో “ఆడుదాం ఆంధ్రా” కార్య‌క్ర‌మం రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం