EX Minister Roja Comments: లడ్డూ కల్తీ వివాదంపై మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు (EX Minister Roja Comments) చేశారు. రాజకీయాల కోసం దేవుడిని రోడ్డు మీదకి లాగారని ఆమె మండిపడ్డారు. ప్రజలు తిరుమలకు వచ్చి ఇప్పుడు లడ్డూ తీసుకోవాలా..? తినాలా వద్దా అని అలోచిస్తున్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందా లేదా అని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారని ఆమె మండిపడ్డారు.
తాజాగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్. పాపం పవన్ కళ్యాణ్ కి ఏమి తెలియదు ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడమే పని. ట్యాంకర్లు వచ్చింది, శాంపుల్ తీసుకుంది, ల్యాబ్ కు పంపింది, రిపోర్టు వచ్చింది అన్ని చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే.. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుట్రకు తేరలేపారు.
Also Read: Realme p2 pro 5G: మార్కెట్ లోకి విడుదలైన మరో రియల్ మీ 5జీ స్మార్ట్ ఫోన్.. ప్రత్యేకతలు ఇవే!
చంద్రబాబు నాయుడుకి తప్పు చేశామని తెలిసే సైడ్ అయ్యి పవన్ కళ్యాణ్ ముందర పెట్టి డ్రామాలాడిస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు భక్తి లేదు. బూట్లతో చెప్పులతో దేవుడిని మొక్కుతాడు, పూజలు చేస్తాడు. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేశాడు… అయినా బుద్ది రాలేదు. వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడు చంద్రబాబు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు. ఒక దొంగ రిపోర్టును తీసుకొని వచ్చి జంతువుల కొవ్వు కలసిందని అబద్ధం చెప్పారు అని ఆమె మండిపడ్డారు.