Site icon HashtagU Telugu

TDP : మహిళల ఓట్ల కోసమే మొక్కుబడి పెళ్లి కానుకలు : మాజీ మంత్రి పీత‌ల సుజాత‌

TDP

TDP

2019లో ముఖ్యమంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జగన్ రెడ్డి పెళ్లికానుక పథకం గురించే ఆలోచించలేదని మాజీ మంత్రి పీత‌ల సుజాత ఆరోపించారు. పేద, మధ్య తరగతి వర్గాలను జగన్ కావాలనే నిర్లక్ష్యం చేసి, పెళ్లిళ్ల సమయాల్లో ఆయా వర్గాలను దారుణంగా వంచించార‌ని ఆమె తెలిపారు. మహిళల సంతోషమే, రాష్ట్ర.. దేశ సంతోషమని గట్టిగా నమ్మిన పార్టీ తెలుగుదేశమని, ఆ క్రమంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ స్త్రీల కోసం అనేక పథకాలు అమలుచేసి, వారిని సామాజికంగా, ఆర్థికంగా,  రాజకీయంగా ప్రోత్సహించారని..  చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో మహిళల శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటిచెప్పారన్నారు, దీపం వంటి పథకాలతో మహిళలకు చంద్ర‌బాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని మహిళల సంతోషం కోసం చంద్రబాబు తన పాలనలో అనేక గొప్ప పథకాలు అమలు చేశారని తెలిపారు.వీటిలో ప్రధానమైంది ‘పెళ్లికానుక’ పథకమ‌ని.. పెళ్లిళ్లు చేయాలంటే పేద, మధ్యతరగతి వర్గాలు తల తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. వాస్తవంలో ఆయా వర్గాలు పడే బాధలు చూసే, చంద్రబాబు ‘పెళ్లికానుక’ పథకం ప్రారంభించారని.. పథకం ప్రారంభించిన ఒక్క ఏడాదిలోనే 80వేల మంది ఆడబిడ్డలకు నేరుగా ఆర్థిక సహాయం అందించిన ఘనత చంద్రబాబుద‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నూతన వధూవరులు పెళ్లి పీఠలపై ఉన్నప్పుడే పెళ్లికానుక కింద ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయాన్ని దంపతులకు అందించిన ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం ఒక్కటేన‌న్నారు పెళ్లికానుక ఆర్థిక సహాయాన్ని టీడీపీ ప్రభుత్వం కల్యాణమిత్రలద్వారా నేరుగా వధువులకు అందించిందని పీత‌ల సుజాత గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాటినుంచి పెళ్లికానుక ఎందుకు అమలుచేయలేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు తన అవినీతిపత్రిక సాక్షిలో తాటి కాయంత అక్షరాలతో ‘పెళ్లికానుక’ కింద తన ప్రభుత్వం ఇంత ఇచ్చింది..అంత ఇచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. నాలుగేళ్లపాటు ‘పెళ్లికానుక’ పథకాన్ని అటకెక్కించిన జగన్ రెడ్డి, కేవలం ఎన్నికల సమీపిస్తున్న ఆఖరి ఏడాదిలో తూతూమంత్రంగా తిరిగి అమలు చేయడానికి సిద్ధమయ్యార‌ని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ రూ.12 లక్షల కోట్లకు పెరిగినా నాలుగేళ్లపాటు పెళ్లికానుక పథకం సమగ్రంగా ఎందుకు అమలు చేయలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెళ్లికానుక పథకం అందించమని వచ్చిన 4లక్షల పైచిలుకు దరఖాస్తుల్ని జగన్ రెడ్డి వెంటనే పరిష్కరించాలన్నారు.

Also Read:  Bhagavanth Kesari : రేపటి నుండి భగవంత్ కేసరి స్ట‍్రీమింగ్ ..