Site icon HashtagU Telugu

TDP : మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Paritala sunitha

Paritala sunitha

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ను ఖండిస్తూ అనంత‌పురం జిల్లాలో మాజీ మంత్రి ప‌రిటాల సునీత నిరాహార దీక్ష చేప‌ట్టారు. గ‌త రెండు రోజులుగా ఆమె ఈ దీక్ష చేస్తున్నారు. అయితే పోలీసులు ఆమె దీక్ష‌ను భ‌గ్నం చేశారు. తెల్ల‌వారుజామున పోలీసులు దీక్షా శిభిరాన్ని చుట్టుముట్టి ప‌రిటాల సునీతాను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో వైద్య‌ప‌రీక్ష‌ల కోసం ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆసుప‌త్రిలోనూ ఆమె దీక్ష‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. పోలీస్ స్టేష‌న్‌కి తీసుకెళ్లిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు వైద్యం అందించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా నిర‌హార‌దీక్ష చేశారు. ఆయ‌న దీక్ష‌ను కూడా పోలీసులు భ‌గ్నం చేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌ను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆయ‌న అభిమానులు ఆందోళ‌న చేస్తున్నారు. గ‌త 18 రోజులుగా చంద్ర‌బాబు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌లో రిమాండ్ లో ఉన్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌ని హైకోర్టు తిర‌స్క‌రించింది. దీంతో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ చంద్ర‌బాబు సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించారు. ఇటు బెయిల్ పిటిష‌న్‌పై ఏసీబీ కోర్టు రేప‌టికి వాయిదా వేసింది.