టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు లో భారీ షాక్ తగిలింది. ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుపై నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఈ విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి సూచించారు. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుకోవడం తో… విచారణను ఏసీబీ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. రేపు విచారణకు రావాలని నారాయణకు ఇప్పటికే సీఐడీ (AP CID) నోటీసులు జారీ చేసింది. విచారణ ఎల్లుండికి వాయిదా పడడంతో రేపు నారాయణకు సీఐడీ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే క్రమంలో రేపు నారాయణను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
Read Also : BRS Master Strategy : కాంగ్రెస్ ఓట్లపై జనసేన, బీఎస్పీ, ఎంఐఎం గురి
ఇదిలా ఉంటె రింగ్ రోడ్డు అలైన్మెంట్లో తాను సైతం భూమి కోల్పోయానని నారాయణ చెప్పుకొచ్చారు. మూడు రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఆ విషయానికి వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో తనకు చెందిన ఏడు కోట్ల రూపాయల విలువచేసే 41 సెంట్లు భూమి కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవైపు భూసేకరణ జరగలేదని చెబుతూనే.. తన భూమి సైతం రోడ్డు అలైన్మెంట్లో పోయిందని చెప్పడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క ఇదే కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈకేసులో తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు కొనసాగించారు. వాదనలు ముగియడంతో.. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.