Nara Lokesh : నెల్లూరు ఘటనపై ప్రభుత్వంపై విరుచుకు పడిన నారాలోకేష్

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించి యాసిడ్ పోసి, గొంతు....

  • Written By:
  • Updated On - September 6, 2022 / 03:41 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ప్రయత్నించి యాసిడ్ పోసి, గొంతు కోసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా..? వైసీపీ అధినేత జ‌గ‌న్‌రెడ్డి గారు త‌ల్లిని త‌రిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని చంపేస్తే..వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఊరుకుంటారా..? ఇదిగో ఇలా ఊరుమీద ప‌డి అన్నెంపున్నెం ఎరుగ‌ని బాలిక‌ల‌పై మాన‌వ‌త్వానికే మాయ‌నిమ‌చ్చ‌లా దాడుల‌కి తెగ‌బ‌డుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణానికి పాల్ప‌డిన నాగ‌రాజు వైసీపీ కార్య‌క‌ర్త కావ‌డంతో పోలీసులు ఏ క‌ట్టుక‌థ అల్లుతారో..? అంటూ ఆరోపించారు.

ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ని ర‌క్షించిన‌ట్టే ర‌క్షిస్తారంటూ ఎద్దేవా చేశారు. జ‌గ‌న్‌రెడ్డి సీఎం కావ‌డంతోనే నేర‌స్తులు, దోపిడీదారులు, రేపిస్టులు ఇది త‌మ రాజ్‌ మ‌న్న‌ట్టు చెల‌రేగిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దురాగ‌తాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌క‌పోతే రాష్ట్రంలో ఆడ‌పిల్లలు, మ‌హిళ‌లు క‌నుమ‌రుగ‌య్యే ప్ర‌మాదం ఉందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై ఘాతుకానికి పాల్పడిన కామాందుడిని కఠినంగా శిక్షించాలని.. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.