Site icon HashtagU Telugu

TDP : తెర వెనుక త‌మ్ముడితో జ‌గ‌న్ రెడ్డి ఇసుక దోపీడి : మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

TDP

TDP

తెర వెనుక తన తమ్ముడిని పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని, మైనింగ్ తో సంబందం లేని కంపెనీలకు ఇసుక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ప్ర‌శ్నించారు. ఇసుక టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయ‌న ఆరోపించారు. దీనివెనుక సీఎంవో ప్రమేయం ఉందని.. ఏపీఎండీసీని కాదని కోల్‌క‌తా కంపెనీతో టెండర్లు నిర్వహించటం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. టెండర్ లో ఏముందో తెలుసుకోవాలంటే రూ. 29.5 లక్షలు కట్టాలని.. బిడ్ సెక్కూరి రూ. 120 కోట్ల నుంచి రూ. 77 కోట్లకు తగ్గించారన్నారు. టెండర్ రిజర్వ్ ధర 1529 కోట్లకే పరిమితం చేశారని.. దీని వెనుక సీఎంవో కుట్ర దాగి ఉంద‌ని న‌క్కా ఆనంద్ బాబు ఆరోపించారు. జేపీ వెంచర్స్ కి మే నెలలోనే అగ్రిమెంట్ కాలపరిమితి దాటితే.. నేటికీ ఏ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. కొత్త టెండర్ పిలిచే వరకు జేపీ వెంచర్స్ కి అనుమతులు పొడుగిస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి నోటి మాటగా చెప్పారు తప్ప అందుకు ఏమైనా ఆదేశాలిచ్చారా? అని ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

అడ్డగోలుగా వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని.. 110 రీచ్ లలో అనుమతుంటే 500 పైగా రీచ్ లలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎన్విరాల్ మెంట్ క్లియరెన్స్ లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని.. వే బిల్లులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే కలెక్టర్లు ఏం చేస్తున్నారని న‌క్కా ఆనంద్ బాబు ప్ర‌శ్నించారు. సెంట్రల్ సర్వీస్ లో ఉన్న వెంకటరెడ్డిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి ఏపీఎండీసీ డైరక్టర్ గా నియమించి అక్రమ ఇసుక దోపిడి చేస్తున్నారన్నారు. ఉచిత ఇసుక ఇచ్చి సామాన్యులకు న్యాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేన‌ని..కానీ జగన్ రెడ్డి ఉచిత ఇసుక రద్దు చేసి 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డున పడేశారన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు వెంకటరెడ్డి సమాదానం చెప్పేవరకు వదలిపెట్టమ‌ని.. ఇప్పుడు ఇసుకలో దోచుకుంటున్న వారి నుంచి తిన్నదంతా క‌క్కిస్తామ‌ని హెచ్చ‌రించారు.

Also Read:  Rahul Gandhi : తెలంగాణలో దొరల పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే – రాహుల్