TDP : ద‌ళితుడిని చంపిన వాడితో సీటు, స్వీట్లు పంచుకున్న ద‌ళిత వ్య‌తిరేకి జ‌గ‌న్ – మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు

సీఎం జ‌గ‌న్ ద‌ళిత వ్య‌తిరేకి అని మాజీ మంత్రి న‌క్కాఆనంద‌బాబు అన్నారు. దళితుడిని కిరాతకంగా చంపిన వాడితో సీటు, స్వీట్లు

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 09:37 PM IST

సీఎం జ‌గ‌న్ ద‌ళిత వ్య‌తిరేకి అని మాజీ మంత్రి న‌క్కాఆనంద‌బాబు అన్నారు. దళితుడిని కిరాతకంగా చంపిన వాడితో సీటు, స్వీట్లు పంచుకోవడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమ‌న్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్న జగన్ రెడ్డి…అతనితో కలిసి వేదిక ఎలా పంచుకున్నారు? అని ప్ర‌శ్నించారు. దళితుల్ని వంచించడానికే జగన్ రెడ్డి తనపార్టీ తరుపున అనంత బాబు సస్పెన్షన్ పై ఉత్తుత్తి ప్రకటనలు చేయించార‌ని ఆరోపించారు. మాట్లాడితే నాఎ స్సీలు అని గుండెలు బాదుకుంటూ గొంతు చించుకునే జగన్ మోహ‌న్ రెడ్డి అనంతబాబుపై ఏం చర్యలు తీసుకుంటారో దళితులకు సమాధానం చెప్పాల‌న్నారు. దళితుల ఓట్లు గంపగుత్తగా దండుకొని ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి ఏలుబడిలో అదే దళితులపై 2,000వరకు దారుణాలు జరిగాయన్నారు. వైసీపీ నేతలే హత్యలు, అత్యా చారాలు, దూషణలు, దాడులకు తెగబడుతున్నా ఏనాడూ జగన్ రెడ్డి మాటమాత్రంగా కూడా స్పందించలేదని ఆరోపించారు.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్ గా పనిచేసే దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపి, అతని శవాన్ని డోర్ డెలి వరీ చేసి, ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మృతుడి భార్యను బెదిరించి వెళ్లాడని తెలిపారు. అంత అమానుషానికి పాల్పడిన తనపార్టీ ఎమ్మెల్సీపై ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి ఒక్క చర్యకూడా తీసుకోలేదని.. పైగా అతనికి ఇంకా అధికప్రాధాన్యత ఇచ్చి, అక్కున చేర్చుకున్నారని ఆరోపించారు. తన డ్రైవర్ ను చంపింది తానేనని అనంతబాబు ఒప్పుకు న్నందున అతన్ని తమపార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ జిల్లా వైసీపీ నాయకత్వం మొక్కుబడిగా చేతులు దులుపుకుందన్నారు.

జగన్ మోహ‌న్‌ రెడ్డి అధికారంలో ఉంటే, అతని కింద పనిచేసే పోలీసులు హత్యానేరం ఒప్పుకున్న వైసీపీ ఎమ్మెల్సీపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎమ్మెల్సీని సస్పెండ్ చేశామని చెప్పిన వారు… తరువాత మరలా వైసీపీ సమావేశంలో అతనికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చి మరీ జగన్ రెడ్డి పక్కనే కూర్చొబెట్టి రాచ మర్యాదలు చేయడమేంట‌ని ప్ర‌శ్నించారు. చేవచచ్చి బతుకుతున్న వైసీపీ దళితనేతలు.. మంత్రులు ఇప్పటికైనా దళితద్రోహి జగన్ రెడ్డిని కాలర్ పట్టుకొని నిలదీయాలని ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.