Site icon HashtagU Telugu

Andhra Pradesh : ద‌ళితుల‌పై దాడులు చేస్తుంటే యాత్ర‌లు చేస్తున్న మంత్రుల‌కు సిగ్గులేదా..?

TDP

TDP

నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ద‌ళిత యువ‌కుడు శ్యామ్‌ని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు ప‌రామ‌ర్శించారు. కంచికచర్ల అంబేద్కర్ నగర్ కి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ‘నా ఎస్సీలు,నా ఎస్టీలు అంటూ ప్రతి వేదికపై ముఖ్యమంత్రి జగన్ వారిపై ఎన లేని ప్రేమ ఒలకబోస్తున్నా.. వైకాపా పాలనలో దళితులపై దాష్టీకాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో అగ్రకులానికి చెందిన హరీష్ రెడ్డి అతని స్నేహితులు మరో ఆరుగురు.. దళిత యువకుడిపై అమానుషంగా ప్రవర్తించారన్నారు. దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్‌ని కారులో తీసుకెళ్లి నాలుగు గంటలపాటు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తిప్పుతూ నరకం చూపించారన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మంచినీళ్లు అడిగితే రహదారి మధ్యలో కారు ఆపి మూత్రం పోసి అవహేళన చేస్తూ అమానుషంగా ప్రవర్తించారని మండిప‌డ్డారు. బాధితుడిని కులం పేరుతో దూషిస్తూ.. ఇవీ మీ బతుకులు అంటూ అవమానకరంగా దూషించారన్నారు. వీళ్లంతా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ధైర్యంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని.. ఇంత జరిగితే పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసులు చూస్తే అన్ని బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయిపోయాయన్నారు. ద‌ళిత యువ‌కుడి మీద హ‌త్య‌యాత్నం జ‌రిగితే సామాజిక సాధికార బస్సుయాత్ర చేస్తున్న మంత్రులకు సిగ్గుండాల‌న్నారు.దీనిపై మంత్రులు ఎందుకు మాట్లాడ‌టంలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే వాడికి రెడ్ కార్పొరేట్ పరిచి సభలు సమావేశంలో పెద్దపీట వేస్తున్నారని న‌క్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. తాడేపల్లి కూతవీడు దూరంలో దళిత మహిళపై రేప్ చేసిన వెంకటరెడ్డి బయట తిరుగుతున్నాడ‌ని.. రేపల్లె నియోజకవర్గం ఉప్పల వారి పాలెం లో అమర్నాథ్ గౌడ్ అనే 15 ఏళ్ల కుర్రాడిని చంపిన వ్యక్తి బయట తిరుగుతున్నాడన్నారు.

Also Read:  Minister Gunman Suicide: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్‌ ఆత్మహత్య.. కారణమిదేనా..?