Site icon HashtagU Telugu

Kodali Nani: చంద్రబాబు పవన్ కల్యాణ్ మర్డర్ కు ప్లాన్ : కొడాలి నాని!

kodali nani

kodali nani

ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జనసేన అధినేత పవన్ హత్యకు కొంతమంది కుట్ర చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇంటి వద్ద రెక్కీపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ఏపీలో 45సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు తప్పా మరేవరూ చేయరన్నారు. పవన్ కల్యాణ్ ను ముంచాలన్నా, చంపినా, బతికినా…ఏం చేసినా చంద్రబాబు చేస్తాడన్నారు. చంద్రబాబు తన ప్రయోజనం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా పవన్ కల్యాణ్ ను అనుమానస్పద వ్యక్తులు అనుసరించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ ఘటన తర్వాత పవన్ ఇల్లు, కార్యాలయం చుట్టూ అనుమానస్పదంగా కొందరు వ్యక్తులు తిరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.