Site icon HashtagU Telugu

Kodali Nani : పరిపాలనా రాజధాని వైజాగ్ వెళ్లడం ఖాయం..!!

kodali nani

kodali nani

మూడు రాజధానులపై తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పరిపాలనా రాజధానికి వైజాగ్ తీసుకెళ్లడం ఖాయమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగానే తమ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. కర్నూలులో న్యాయరాజధాని ఖాయమన్నారు. జగన్ సంకాల్పాన్ని అడ్డుకునే వాళ్లు ఈ రాష్ట్రంలో లేరన్నారు. టీడీపీ పాదయాత్ర ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు.

అమరావతిపై పుస్తకాన్ని ఆవిష్కరించి చంద్రబాబు …జగన్ పై విమర్శలు చేస్తున్నాడని..హైదరాబాద్ ను నిర్మించింది తానే అన్నడాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు నాని. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి హైదరాబాద్ నిర్మించడం ప్రారంభించాడట అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు ప్రారంభిస్తే…దానిని వైఎస్ కొనసాగించారట…బాబు వేసిన గ్రాఫిక్స్ ను జగన్ కొనసాగించాలా..అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచి ప్రజలను మభ్యపెట్టవచ్చు.అనుకుంటున్నాడని కొడాలని నాని అన్నారు.