Site icon HashtagU Telugu

Kodali Nani: వైరల్ అవుతున్న మాజీ మంత్రి కొడాలి నాని బస్సు డ్రైవింగ్..

Ex-minister Kodali Nani bus driving which is going viral..

Kodali Nani

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఏమి చేసినా వైరల్ గా మారిపోతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విపక్ష నేతలపై ఆయన వేసే పంచ్ డైలాగులు వైరల్.. తాజాగా ఆయన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. బస్సును స్వయంగా నడిపిన నాని కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు. కొడాలి నాని (Kodali Nani) చేతుల మీదుగా ఈ బస్సులను ప్రారంభించడం జరిగింది. ఇదే సమయంలో కొడాలి నాని తనకున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కిల్స్ ను ప్రదర్శించారు. ఒక బస్సును స్వయంగా నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరుల బస్సులను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు ..

Also Read:  Punjab CM visit Telangana: నేడు పంజాబ్ సీఎం తెలంగాణలో పర్యటన