TDP : భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపే హక్కు మాకు లేదా..?

రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు పులుస్టాప్ పడాలని మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర అన్నారు.

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 09:16 PM IST

రాష్ట్రంలో జగన్ ఆడుతున్న వికృత క్రీడకు పులుస్టాప్ పడాలని మాజీమంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర అన్నారు. అధికారులు ఇచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లభించలేదని, చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నించారు. చంద్రబాబుతో లాయర్లు రోజువారీ అయ్యే ములాఖత్ లను కూడా తగ్గించారని, దళితులను చంపిన వారికి, శిరోముండనాలు చేసిన వారికి ఇష్టానుసారంగా ములాఖత్ లకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో బుధవారం నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు. జైలు వ‌ద్ద లోకేష్‌ని, మాజీ మంత్రులు కళావెంకట్రావు, కొల్లు ర‌వీంద్ర క‌లిశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై త‌మ‌కు ఆందోళన ఉందని.. చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షలు, డాక్టర్లు ఏం సలహాలు ఇచ్చారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని భువనేశ్వరి ఇటీవల అధికారులకు లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. చంద్రబాబు వైద్య నివేదికను వ్యక్తిగత డాక్టర్లకు పంపిస్తే పాత మందులకు మార్పులు చేర్పులు చేస్తే గానీ పరిస్థతి మారుతుందేమో చూడాలన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలతో 40 రోజులుగా చంద్రబాబును జైల్లో పెట్టారని.. కేసును ఏదో విధంగా ఆలస్యం చేసి చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 40 రోజులుగా ఒక్క ఆధారం కూడా కోర్టులకు చూపించలేదని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండే విధంగా జగన్ ఉండటం లేదని.. ఈ ప్రభుత్వంలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయింద‌న్నారు. జైల్ల శాఖ డీఐజీ ప్రభుత్వాన్ని మెప్పించేలా మాట్లాడుతున్నారని.. పోలీస్ వ్యవస్థలకు కొన్ని విలువలు ఉంటాయని..వాటికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. జగన్ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని పోలీసులను పావులా వాడుకుంటున్నారని.. కొందరు చేసే చెడ్డ పనులతో వ్యవస్థలకు చెడ్డపేరు వస్తోంద‌న్నారు. డాక్టర్ల నివేదకను వెంటనే కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మాజీ మంత్రులు డిమాండ్ చేశారు.

Also Read:  TDP : ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసిన టీడీపీ నేత‌లు.. త‌ప్పుడు కేసుల వివ‌రాల్ని గ‌వ‌ర్న‌ర్‌కి అంద‌జేత‌