Police vs MLA : గ‌న్‌మెన్ల‌ను స‌రెండర్ చేసిన మాజీ మంత్రి బాలినేని.. సీఎం జ‌గ‌న్‌తో మ‌రికాసేప‌ట్లో భేటీ

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సొంత పార్టీలో ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. జిల్లాలో జ‌రుగుతున్న

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 10:29 AM IST

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సొంత పార్టీలో ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. జిల్లాలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవ‌ల ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం విష‌యంలో బాలినేని పోలీసుల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌కాశం జిల్లా పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస రెడ్డి సీరియస్ అయ్యారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి బాలినేని లేఖ రాశారు. ఈ కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను బాలినేని కోరారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు. కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు. అయితే గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసిన విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని జిల్లా పోలీసులు అంటున్నారు. ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్‌తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటి కానున్నారు. సీఎం క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన త‌రువాత బాలినేని జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్నారు. ముందుగా సీఎం సెక్ర‌ట‌రీ ధ‌నుంజ‌య్‌రెడ్డితో బాలినేని భేటీ కానున్నారు. జిల్లాలో జ‌రుగుత‌న్న ప‌రిణామాల‌ను ధ‌నుంజ‌య్‌రెడ్డికి, సీఎం జ‌గ‌న్‌కు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వివ‌రించనున్నారు. గ‌తంలో కూడా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో వేరే పార్టీ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం కూడా సాగింది. ఇటీవ‌ల చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత రాష్ట్రంలో జ‌ర‌గుతున్న ప‌రిణామాల‌పై బాలినేని స్పందించారు. వైసీపీ అధికారంలోకి రాక‌పోతే మ‌న ప‌రిస్థితి ఎమ‌వుతుంద‌ని ఆయ‌న క్యాడ‌ర్‌ని ఉద్దేశించి మాట్లాడారు.

Also Read:  2023 Telangana Assembly Polls : మరికొన్ని గ్యారెంటీ హామీలను ప్రకటించిన కాంగ్రెస్..