మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. తరచూ ఆయన ఏదో ఒక వివాదంలో ఇటీవల కనిపిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు బంగారం ఆయన కారులో తరలిస్తూ పట్టు బడినప్పటి నుంచి తాజాగా సినిమా పెట్టుబడుల వివాదం వరకు సంచలనంగా మారాడు. మైత్రి మూవీస్ (Mythri Movies)లో పెట్టుబడులు పెట్టాడని విశాఖ జనసేన కొర్పొరేటర్ తాజాగా ఆయన మీద చేసిన ఆరోపణ. అందుకు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఒక వేళ మైత్రి మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
ఏ నిర్మాతో అయినా కలిసి తాను పెట్టబడులు పెట్టానా లేదో అడిగి తెలుసుకోవాలని పవన్ కు సవాల్ చేశారు. ‘ఈ వ్యవహారం పై ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి.. సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి’ పేర్కొన్నారు. పవన్ తమ పార్టీ కార్పోరేటర్ పైన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేసారు. గతంలో బాలినేని ని అభినందించిన పవన్, ఇప్పుడు తాజా గా ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తిగా ఉంది.
Also Read: Eluru: ఏలూరులో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ఇంజినీరింగ్ విద్యార్థినిని గదిలో బంధించి టార్చర్
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు బాలినేని సహకారం అందించారు. ఆ వేదిక నుంచే సినీ దర్శకుడు గోపీచంద్ ప్రత్యేకంగా బాలినేనికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు జనసేన నేత ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆరోపణలు చేసినట్లు భావిస్తున్నారు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సహకరిస్తే మైత్రీ మూవీస్ లో పెట్టుబడులు పెట్టినట్లా అంటూ బాలినేని నిలదీస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం అయితే సహకరిస్తానన్నారు.
వైసీపీ ముఖ్య నేత బాలినేని శ్రీనివాస రెడ్డి సినీ ఇండస్ట్రీలో పెట్టుబడుల పై చర్చ సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో బాలినేని పెట్టుబడులు ఉన్నాయని విశాఖపట్నం జనసేన కార్పోరేటర్ ఆరోపించారు. దీని పైన బాలినేని సీరియస్ అయ్యారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనకు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజ్ వంటి మిత్రులు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. పరిచయాలు ఉంటే పెట్టుబడి పట్టారని ఆరోపణలు చేయటం సరి కాదని చెప్పారు. తాను పెట్టుబడి పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ లో పెట్టుబడుల పై రాజకీయ వివాదం కొనసాగుతోంది. మాజీ మంత్రి బాలినేని పైన కొనసాగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలినేని పెట్టుబడులు పెట్టారని జనసేన నేత ఆరోపించారు. దీని పైన స్పందించిన బాలినేని అసలు విషయం తేల్చి చెప్పారు. సినీ ఇండస్ట్రీలో తనకు దిల్ రాజు వంటి చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పారు. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరం ఉంటే సహకారం అందిస్తామని హితవు పలికారు. అంత మాత్రాన పెట్టుబడులు పెట్టమని ఆరోపించడం సరికాదని , దీనిపై పవన్ స్పందించాలని డిమాండ్ చేయటం పొలిటికల్ వేడి పుట్టించింది.