Site icon HashtagU Telugu

Anil Kumar Yadav : నాపై సొంత పార్టీ నాయకులే కుట్ర చేస్తున్నారు..!!

Anil Kumar Yadav

Anil Kumar Yadav

మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్..తన పార్టీ నాయకులపై మండిపడ్డారు. తనసొంత నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు సొంత పార్టీ నాయకులే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరులోని 52 వ డివిజన్ లో అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్ కుమార్…ఈ వ్యాఖ్యలు చేశారు. తనను దెబ్బ కొట్టేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు కొందరు డబ్బులిచ్చి తనపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.

డబ్బులిచ్చి తనను తిట్టించే స్థాయికి టీడీపీ దిగజారిందని మండిపడ్డారు అనిల్ కుమార్. వైసీపీలో ఉన్న ఓ నేత ఈ సిగ్గుమాలిన పనిచేయిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులతో టచ్ లోనే ఉంటూ టీడీపీ నేతల్లో ఒకరు రోజుకు పదివేలు మరికొందరు లక్ష రూపాయల చొప్పున సంపాదిస్తున్నారని మండిపడ్డారు. వారి చరిత్ర తన దగ్గర ఉందన్న అనిల్ కుమార్..సమయం వచ్చినప్పుడు బయటపెడతానని పేర్కొన్నారు.