Site icon HashtagU Telugu

Viveka Murder : మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ..?

Adinarayana reddy

Adinarayana reddy

మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ఈ కేసులు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. తాజాగా మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదినారాయ‌ణ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఒక క్రమం ప్రకారం కొనసాగుతోందని అన్నారు. 24వ తేదీన సీబీఐ విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని… వేరే కారణాలు చెప్పి ఇంతకు ముందులా విచారణకు గైర్హాజరైతే, దాన్ని సీబీఐ అధికారులు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. విచారణ తర్వాత అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.