AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడిని అంటూ మాజీ ఐఏఎస్ సంచలన పోస్ట్

ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ భూ హక్కు చట్టం బాధితుడినంటూ పేర్కొన్నారు.

AP Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు వారాల్లో అసెంబ్లీ మరియు ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలకు పాల్పడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతిపక్ష ఎన్డీయే కూటమి తాజాగా అధికార పార్టీ వైసీపీ తీసుకుని చట్టాన్ని అవినీతి చట్టంగా పేర్కొంటుంది. అయితే వైసీపీ ఈసీకి ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో ఈ చట్టంపై ఊహాగానాలను మరింత ఎక్కువయ్యాయి.

We’re now on WhatsApp : Click to Join

ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి ల్యాండ్ టైట్లింగ్ చట్టం బాధితుడిని అంటూ సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. తల్లిదండ్రుల భూములపై ​​హక్కును కాలరాస్తున్నారని మండిప డ్డారు ఆయన. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలు తెరవకుండానే తిరిగి వచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. నా తల్లిదండ్రుల భూములపై ​​నాకున్న హక్కును కాలరాస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

తాను 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించానని తెలుపుతూ..నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల కష్టాలు ఊహించలేం అన్నారు.

Also Read: Delhi: కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్