Site icon HashtagU Telugu

Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..

Ex Ias Officer Imtiaz Joins

Ex Ias Officer Imtiaz Joins

మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్ (Ex IAS Officer Imtiaz ) గురువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతియాజ్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్‌ఖాన్‌ ఉన్నారు. వైసీపీ నిర్వహించిన సరేల్లో ఆయనకు అంత అనుకూలంగా లేనట్లు రిపోర్టులు రావడంతో ఒక మంచి అభ్యర్థిని రంగంలోకి దించాలని సీఎం జగన్ భావించారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ఇంతియాజ్‌ అహ్మద్‌ మంచి ఐఏఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేసి పలువురి మన్ననలు పొందారు. ఇంతియాజ్‌ అహ్మద్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం..వైసీపీ నుండి బరిలోకి దిగుతుండడం తో రాష్ట్రంలో చర్చగా మారింది. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వీ. మోహన్ రెడ్డిలను రాజకీయంగా ఆదుకొంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయం మేరకు ఇంతియాజ్ ను గెలిపిస్తామని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. మైనార్టీలకు జగన్ అండగా ఉన్నారన్నారు.మెజార్టీ స్థానాల్లో మైనారిటీలకు సీఎం అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచనగా హఫీజ్ ఖాన్ తెలిపారు.

Read Also : Dharani Portal : ధరణి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం