Site icon HashtagU Telugu

Ex CM Chandrababu : సీఎం జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌… మూడో రోజు కుప్పంలో ప‌ర్య‌ట‌న‌

Kuppam

Kuppam

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఫైర్ అయ్యారు. సీఎం జగన్ నార్త్ కొరియా నియంత కిమ్ వాళ్ళ అన్నలా ఉన్నాడని ఆయ‌న ఎద్దేవా చేశారు. కుప్పం మోడల్ కాలనీ లో ప‌ర్య‌టించిన చంద్రుబాబుకు మ‌హిళ‌లు హారతులు ఇచ్చి స్వాగతం ప‌లికారు. ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని.. రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జ‌గ‌న్‌పై మండిప‌డ్డారు. నిన్నటి కుప్పం ఘటన తాను ఎప్పుడూ చూడ‌లేద‌ని.. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. నిన్న పోలీసుల సాక్షిగానే టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగిందని.. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అని చంద్రబాబు ప్ర‌శ్నించారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్‍పై దాడి జ‌రిగింద‌ని.. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం డీజీపీయేన‌ని ఆయ‌న ఆరోపించారు. నేరస్థుల పాలన ఎలా ఉంటుందో నిన్న కుప్పం లో చూసామని.. 33 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గా తాను ఉన్నాన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

కుప్పంలో మోడల్ కాలనీ లో 650 ఇళ్ళు కట్టి ఆదర్శం గా తీర్చి దిద్దామని.. అదనంగా ఇళ్ళు కట్టే 100 కోట్ల ప్రాజెక్ట్ ను నిలిపివేశారని చంద్ర‌బాబు ఆరోపించారు. కుప్పం పై సీఎం కు అభిమానం ఉంటే తాను 3000 కడితే…సీఎం10000 ఇళ్ళు కట్టాల‌ని డిమాండ్ చేశారు. తాను పులివెందులను అభివృద్ధి చేశాన‌ని.. గండికోట నుంచి నీళ్లు ఇచ్చానని చంద్ర‌బాబు గుర్తు చేశారు. అన్న కాంటీన్ పై \ఈ ప్రభుత్వానికి కోపం ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాడులో అమ్మ క్యాంటీన్ ఉంటే..దాన్ని ఇప్పటికీ స్టాలిన్ కొనసాగించారని చంద్ర‌బాబు గుర్తు చేశారు. టీడీపీ అన్నం పెట్టే పార్టీ….వైసీపీ సున్నం పెట్టే పార్టీ అని వ్యాఖ్యానించారు. జగన్ దిగిపోయే నాటికి రాష్ట్రం లో అప్పు 10 లక్షల కోట్లకు చేరుతుందని.. 25 ఏళ్ల పాటు ప్రజలు మద్యం తాగాలి అని అప్పులు తెచ్చిన వ్య‌క్తి జ‌గ‌న్ అని తెలిపార‌కు.

Exit mobile version