Site icon HashtagU Telugu

NCBN : జగన్ బొమ్మ ఉండాల్సింది మన గోడలపై కాదు.. పోలీస్ స్టేషన్ లో.. ! – చంద్ర‌బాబు

CBN Prediction

Chandrababu

సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. తాడికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చారు. జ‌గ‌న్ బొమ్మ ఉండాల్సింది మ‌న ఇంటి గోడ‌ల‌పై కాద‌ని.. పోలీస్ స్టేష‌న్‌లో ఉండాల‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టితో ప్రజలకు మేలు జరుగుతుంద‌ని.. రాజకీయ నేతలు తెలివితో సంపద సృష్టి కోసం పనిచేయాలన్నారు. సంపదను దోచుకునే వారు కాదు…సంపద సృష్టించే వారు నాయకులుగా ఉండాలని చంద్ర‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ది చేసిన తానేన‌ని… దానికి ధీటుగా ఉండాలని అమరావతి ని సంకల్పించానన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి డబ్బులు లేవని.. అప్పుడే ఆలోచించి ల్యాండ్ పూలింగ్ పథకం తీసుకువచ్చి భూములు సేకరించానన్నారు. 29 వేల మంది రైతులు…..33 వేల ఎకరాలు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే చరిత్ర సృష్టించాన‌న్నారు. రైతులు భూములు ఇచ్చి.. మంచి రాజధాని కట్టమని కోరారని..
ఒకప్పుడు మన రోడ్లు అధ్దాన్నంగా ఉండేవి….అప్పుడే ప్రైవేటు పార్టనర్ షిప్ తో రోడ్ల నిర్మాణంచేపట్టామ‌న్నారు.

నాడు పోర్టులు, విద్యుత్, ఎయిర్ పోర్టులు, టెలికాం సెక్టార్ లో సంస్కరణలు తీసుకువచ్చామ‌న్నారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నాడు ప్రాజెక్టులు రూపకల్పన చేశామ‌ని.. ఇందులో భాగంగానే ఒక్కపైసా ఖర్చులేకుండా హైటెక్ సిటీ కట్టామ‌ని గుర్తు చేశారు. దీంతో ఆ ప్రాంతం రూపు మారిపోయిందని.. ఒకప్పుడు ఎకరా భూమి 10 వేలు 20 వేలు….ఇప్పుడు హైదరాబాద్ లో ఎకరం భూమి 30 కోట్లు , 40 కోట్లుగా ఉంద‌న్నారు. తెలంగాణ సీఎం కెసీఆర్ కూడా ఒకప్పుడు ఏపీలో భూముల రేట్లు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయ‌ని అన్నార‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇదే రాజధాని అని జగన్ అన్నాడు…ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అన్నాడు. ఎందుకు నీ ఇల్లు తగలబెట్టడానికా.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాడే మూడు రాజధానులు అంటే ప్ర‌జ‌లు జగన్ తాట తీసేవారని.. రాజధానిపై కుల ముద్ర వేసి నాశ‌నం చేశార‌న్న‌రు. అన్ని కులాల వారూ ఇక్క‌డ భూములు ఇచ్చారని… అలాంటి చోట ఒక కులం పేరు పెట్టి రాజధానిపై కుట్ర చేశారని చంద్ర‌బాబు ఆరోపించారు. జగన్ ఒక స్టిక్కర్ సిఎం…..మీఇంట్లో జగన్ స్టిక్కర్ వేస్తే దాని పక్కన 6093 అని రాయండి. అది జగన్ ఖైదీ నెంబర్ అంటూ ప్ర‌జ‌లు ఉద్దేశించి చంద్ర‌బాబు ప్ర‌సంగించారు.