Site icon HashtagU Telugu

Sailajanath : బాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదు – ఏపీసీసీ మాజీ అధ్య‌క్షుడు చీఫ్ శైల‌జానాథ్‌

Sailajanath

Sailajanath

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మానేసిందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. గత 15 రోజులుగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుని వేధించడం తప్ప ప్ర‌భుత్వం చేస్తుందేమీ లేద‌న్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి రైతులు, ప్రజల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఏపీలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. పోలీస్ యంత్రాంగం యావత్తు అధికార పార్టీ సేవలో ఉందని శైల‌జానాథ్ మండిపడ్డారు. సాక్షాత్తు తిరుమల కొండపై బస్సు కూడా దొంగతనం చేశారంటే పోలీస్ వ్య‌వ‌స్థ ఎంత‌లా ప‌ని చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. రాయలసీమ ప్రాంతం గురించి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా మాట్లాడటం లేదన్నారు. ‘‘మా రాజధాని మాకు కావాలి… రాయలసీమ లో రాజధాని పెట్టాలి’’ అని శైల‌జానాథ్ డిమాండ్ చేశారు. బాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగదని.. బీజేపీ క‌నుస‌న్న‌ల్లోనే చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింద‌ని సాకె శైలజానాథ్ ఆరోపించారు