Site icon HashtagU Telugu

Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే : నారా చంద్రబాబు నాయుడు

Chandrababu

Chandrababu

Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని ఆయన అన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని, నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు.

నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని, రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి….సమగ్ర సాధికారత సాధించాని బాబు కోరారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.