Site icon HashtagU Telugu

Jagan : జగన్ కు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు – కన్నబాబు

Kannababu

Kannababu

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jagan)కి ప్రజల్లో అపారమైన ఆదరణ ఉందని వైసీపీ నేత కన్నబాబు (Kannababu) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రజల జనసంద్రమే కనిపిస్తుందని, ఇది ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యం కాని విషయం అని పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు, అలాగే పాలకొండ పర్యటనలో ప్రజలు జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారని ఆయన తెలిపారు. ప్రజల్లో జగన్ క్రేజ్ చూస్తే సినిమా హీరోలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే అని వ్యాఖ్యానించారు.

MLC Elections : కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టబోతుంది – మంత్రి శ్రీధర్ బాబు

జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటమి చెందిందని కానీ ప్రజల్లో జగన్‌కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఇది చూసి ప్రత్యర్థి పార్టీలు భయపడుతున్నాయని, జగన్ తిరిగి రాజకీయంగా పునరుద్ధరమవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారు, అందుకే ఆయన ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు పొందారని వివరించారు. వైసీపీ గెలిచినా ఓడినా పార్టీ బలంగా ఉందని, ఇది కేవలం ఒక రాజకీయ జోక్యం వల్ల వచ్చిన తాత్కాలిక ఫలితమని అభిప్రాయపడ్డారు. జగన్ తిరిగి రాజకీయపరంగా పునరాగమనం చేయడం ఖాయమని, ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. “ప్రజలు ఇప్పటికీ జగన్‌ను ఆదరిస్తున్నారు, ఆయన పాలనను మరిచిపోలేకపోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో వైసీపీ మరింత బలపడే సూచన” అని కన్నబాబు అన్నారు.