TTD : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతిలో టీటీడీ గోసంరక్షణశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వైసీపీ హయాంలో గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్ముకున్నారని బీఆర్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Read Also: KTR : అక్టోబర్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడి ఎన్నిక : కేటీఆర్
వైసీపీ చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. గోశాల వ్యవహారంపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని చెప్పారు. గోశాలలో అసలేం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి అని బీఆర్ నాయుడు తెలిపారు.
టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే సుబ్రహ్మణ్యస్వామి నిజానిజాలేంటో తెలుసుకోరా అని నిలదీసారు. వైసీపీ హయాంలో గోశాలలో అవినీతిపై ఏసీబీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబును కోరతానని బీఆర్‌నాయుడు వెల్లడించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శానానికి 24 గంటల సమయం పడుతోంది. వారాంతం తో పాటుగా వరుస సెలవులతో రద్దీ పెరిగింది. అటు టీటీడీ గోశాల కేంద్రంగా కొద్ది రోజులుగా రాజకీయ రభస సాగుతోంది.
Read Also: Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు బిగ్ షాక్