Site icon HashtagU Telugu

Andhra Pradesh : ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణను సస్పెండ్ చేసిన ప్ర‌భుత్వం

kr-suryanarayana

kr-suryanarayana

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేటు వేసింది. రాష్ట్ర పన్నుల శాఖ ముఖ్య కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా కూడా పనిచేస్తున్న సూర్యనారాయణను క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ చీఫ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యనారాయణ తన సహ ఉద్యోగులు మెహర్ కుమార్, సంధ్య, వెంకటా చలపతి, సత్యనారాయణలతో కలిసి 2019-2021 మధ్య ప్రభుత్వ ఆదాయాన్ని మోసం చేసే కార్యకలాపాలకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆరోపించింది. AP GEA, AP కమర్షియల్ టాక్సెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సూర్యనారాయణ వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూర్యనారాయణపై విజయవాడ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఆయ‌న పరారీలో ఉన్నాడని, విచారణకు సహకరించడం లేదని స‌మాచారం. సస్పెన్షన్ వ్యవధిలో ముందస్తు అనుమతి లేకుండా విజయవాడ విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఆర్డర్‌లో ఉంది.