VIjayawada Protest: పెరిగిన జీతాల జోష్..చలో విజయవాడ లేనట్టే!

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కొద్దిగా పెరిగాయి.ఐదు డీఏ లు కలిపి జీతాలకు జత చేయడం వల్ల జీతాల్లో భారీ కోత పడుతుంది అని భావించిన ఉద్యోగుల్లో కాస్త ఊరట లభించినట్లు అయ్యింది.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 07:12 PM IST

By:  దామోదర్.చిగులూరి, విజయవాడ

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కొద్దిగా పెరిగాయి.ఐదు డీఏ లు కలిపి జీతాలకు జత చేయడం వల్ల జీతాల్లో భారీ కోత పడుతుంది అని భావించిన ఉద్యోగుల్లో కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. ఒక్కో ఉద్యోగికి దాదాపు వేల రూపాయల జీతం తగ్గిపోతుందని ఆందోళన చెందారు.కానీ ప్రభుత్వం చేసిన డీఏలు కలిపి జీతాలు వేయడంతో ఉద్యోగులు శాంతించినట్టు ఉంది.ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకటించడం,హెచ్.ఆర్.ఏ తగ్గించండం,ఇవన్నీ కొద్దిరోజులుగా లెక్కలు వేసుకున్నారు.

ఒక్కొక్కరికి దాదాపు 5 వేల రూపాయల వరకూ తగ్గుతుందని అంచనాకు వచ్చారు.ఈ గందరగోళం ఉపాధ్యాయుల్లో ఎక్కువగా జరిగింది.అలాగే ఫెన్షనర్లు కూడా తీవ్ర ఆందోళన చెందారు.ఫెన్షనర్లు అయితే తమ ఫెన్షన్ వేలాది రూపాయలు తగ్గిపోతుంది అని భావించారు.నిన్నటి నుండి ఉద్యోగుల కు జీతాలు అకౌంట్లు లో పడిన తరువాత జీతం పెరిగింది అని చెప్పిన ఉద్యోగేగాని,నాకు జీతం,ఫెన్షన్ తగ్గింది అని చెప్పిన దాఖలాలు అయితే లేవు.

ఈ ప్రభావం రేపటి చలో విజయవాడ కార్యక్రమం మీద కూడా పడే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.ఇప్పటివరకు ఉద్యోగులు కొత్త పీఆర్సీ వలన జీతాలు తగ్గిపోతాయని పూర్తిగా ఒక అంచనాకు వచ్చారు.ఇదే విషయం ఉద్యోగుల్లోకి బలంగా వెళ్లడంతో రాష్ట్ర వ్యాపితంగా ఉద్యోగులు తమ సంఘాలకు చెందిన నాయకుల మీద తిరగబడ్డారు.
దీనితో చేసేదిలేక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు.అదే సమయంలో ప్రభుత్వం కూడా వ్యూహాత్మక అడుగులు వేసింది.ప్రతి నెలా 10 వ తేదీ వస్తేగాని పడని జీతాలు తెలివిగా ఈ సారి ఒకటో తేదీన వేయడం వేసిన జీతాల్లో ఎటువంటి కోత లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆవేశం చల్లబడింది అని చెప్పాలి.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దని చెప్పినా,ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారంమే జీతాలు వేయడం 5 డీఏ లు ను కలిపి వేయడంతో ఉద్యోగులకు గాని ఫెన్షనర్లు కుగాని ఎక్కడా జీతాలు తగ్గలేదు.తగ్గుతుందనే ప్రచారం తెలిపోవడంతో పాటు జీతాలు పెరిగాయి.

ప్రభుత్వం ఏ మ్యాజిక్ చేసినప్పటికీ జీతాలు పెరగడం మాత్రం ఉద్యోగుల్లో వూరట కనిపించింది.దీనితో 3 వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం లో ఉద్యోగులు పాల్గొనక పోవచ్చు.ఒక వైపు అనుమతి లేదని పోలీసు ప్రయోగం చేస్తున్నప్పటికీ ఉద్యోగులు తలచుకొంటే చలో విజయవాడ సక్సెస్ అవుతుంది.కానీ జీతాలు పెరిగినప్పుడు ఉద్యోగులు అటువంటి ఘర్షణ వాతావరం కోరుకోరు.కాబట్టి ఇప్పటివరకూ ఉద్యోగులు,ప్రభుత్వం ఘర్షణ వాతావరం ప్రభావం ఇక ఉండకపోవచ్చు..