Site icon HashtagU Telugu

Employees Fight : వై నాట్ CPS దిశ‌గా ఉద్యోగుల ఉద్య‌మ‌బాట‌

Employees Fight

Employees Fight

`వై నాట్ 175 కాస్తా వై నాట్ సీపీఎస్ `దిశ‌గా మ‌ళ్లింది. ఉద్యోగులు  (Employees Fight) మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద దండ‌యాత్ర‌కు దిగారు. అధికారంలోకి వ‌చ్చిన 15 రోజుల్లో సీపీఎస్ ర‌ద్దు చేస్తాన‌ని 2019 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ప‌లుమార్లు ఉద్య‌మించిన ఉద్యోగుల‌కు సీపీఎస్ ర‌ద్దు గురించిన హామీ ల‌భించ‌లేదు. దీంతో చివ‌రి ద‌శ పోరాటానికి ఉద్యోగులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒక వైపు విద్యుత్ ఉద్యోగుల పోరాటంతో పాటు సీపీఎస్ ర‌ద్దుకు డిమాండ్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఉద్యోగులు  మ‌రోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద దండ‌యాత్ర‌(Employees Fight) 

ఉద్యోగులు ఉద్య‌మానికి దిగితే ఎలా ఉంటుంది? అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెండేళ్ల క్రితం రుచిచూశారు. ఆ రోజున ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయింది. కొన్ని ల‌క్ష‌ల మంది రోడ్ల మీద‌కు వ‌చ్చారు. బ‌హుశా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జీవితంలో వ్య‌తిరేకంగా జ‌రిగిన పెద్ద ఉద్య‌మం అదే. దానిపై పోస్ట్ మార్టం చేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆ రోజున డీజీపీగా ఉన్న గౌత‌మ్ సవాంగ్ ను బాధ్యునిగా చేశారు. ఆయన్ను లూప్ లైన్లోకి పంపారు. ఆ త‌రువాత సొంత జిల్లాకు చెందిన రాజేంద్ర‌నాథ రెడ్డిని డీజీపీగా నియ‌మించుకున్నారు. ఉద్య‌మించిన ఉద్యోగుల (Employees Fight) మీద కేసులు బనాయించారు. నాయ‌కులుగా ఉంటూ ఉద్య‌మించిన వాళ్ల‌ను ఏరిపారేశారు.

విద్యుత్ ఉద్యోగులు ముందుకు రావ‌డంతో సీపీఎస్ ర‌ద్దు కోసం

సీపీఎస్ ర‌ద్దు సాధ్యం కాద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. మంత్రివ‌ర్గ ఉప‌సంఘం నివేదిక ప్ర‌కారం సీపీఎస్ బ‌దులుగా జీపీఎస్ ను అమ‌లు చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సిద్ధ‌మ‌యింది. ఆ మేర‌కు సంకేతాలు కూడా ఉద్యోగుల‌కు (Employees Fight)  ఇచ్చారు. మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌మావేశాల తీరును నిర‌సిస్తూ ప‌లు సంద‌ర్భాల్లో సీపీఎస్ ర‌ద్దు కోసం పోరాటం చేయాల‌ని ఉద్యోగులు ప్ర‌య‌త్నించారు. కానీ, మునుప‌టి మాదిరిగా బ‌య‌ట‌కొస్తే, కేసులు పెడ‌తార‌ని భ‌య‌ప‌డి వెన‌క్కు త‌గ్గుతూ వ‌చ్చారు. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులు ముందుకు రావ‌డంతో మిగిలిన వాళ్లు కూడా సీపీఎస్ ర‌ద్దు కోసం రోడ్ల మీద‌కు రావ‌డానికి ధైర్యం చేస్తున్నారు.

Also Read : AP Employees : జ‌గ‌న్ కు పాలాభిషేకం తెచ్చిన‌ తంటా! మంత్రి ఛాంబ‌ర్ కు ఉద్యోగుల తాళం

ఉద్యోగుల ఉద్యమం రెండేళ్ల క్రితం అనూహ్యంగా స‌క్సెస్ కావ‌డాన్ని గుణ‌పాఠంగా ప్ర‌భుత్వం తీసుకుంది. అందుకే, ఉద్యోగ సంఘాల‌ను నిట్ట‌నిలువునా చీల్చేసింది. ప్ర‌స్తుతం ఏపీలో ఉండే ఉద్యోగ సంఘాల నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త‌లేదు. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య‌నారాయ‌ణకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆయ‌న మీద రాజ‌ద్రోహం కేసు పెట్టారు. జీతాల‌ను ప్ర‌తినెలా ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేస్తూ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వెళ్ల‌డం ఆయ‌న చేసిన నేరం. ప్ర‌తిగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ఆయ‌న ఆర్థిక మూలాల‌ను వెదికి వేటువేసింది. దీంతో మిగిలిన సంఘాల నాయ‌కులు (Employees Fight) భ‌య‌ప‌డుతున్నారు. కొంద‌రు ప్ర‌భుత్వానికి స‌రెండ్ అయ్యారు. ఉద్యోగ సంఘం నాయ‌కులుగా చ‌లామ‌ణీ అవుతోన్న బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు, చ‌ల్లా శ్రీనివాస‌రావు లు ప్రస్తుతం జ‌గ‌న్ పంచ‌న ఉన్నారు. దీంతో ఉద్యోగుల ఉద్య‌మాలు ఏమీ చేయ‌లేని ప్ర‌భుత్వం ధీమాగా ఉంది.

Also Read : AP employees : ఉద్యోగ సంఘాల్లో భారీ చీలిక‌, సూర్య‌నారాయ‌ణపై పోలీస్ వేట‌

ఉద్యోగుల ఉద్య‌మానికి అనుమ‌తిలేద‌ని ఇప్ప‌టికే పోలీసులు ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ సీపీ అధికారికంగా చెబుతూ ఉద్యోగుల‌ను హెచ్చ‌రించారు. చ‌ట్టానికి వ్య‌తిరేకంగా రోడ్ల మీద‌కు వ‌స్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఆ మేర‌కు రాష్ట్ర పోలీస్ చాలా సీరియ‌స్ గా ఉంది. దీంతో ఉద్యోగులు ఉద్య‌మాలు చేయ‌డానికి వెన‌క‌డుగు వేస్తున్నారు. సీపీఎస్ ర‌ద్దు అసాధ్య‌మ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడో తేల్చేసింది. ఆ క్ర‌మంలో ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య న‌డుస్తోన్న దోబూచులాట ఎటువైపు దారితీస్తుంది? అనేది సందిగ్ధం.