Employee Movement: ACB అస్త్రం!ఉద్యమంలో జగన్ అంకం!

ఏపీ ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దూకుడు పెంచారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా సంఘాల నేతల తలరాతలు మార్చడానికి సిద్ధం అయింది.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 02:36 PM IST

ఏపీ ఉద్యోగులు (Employee) ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దూకుడు పెంచారు. ఇదే తరుణంలో ప్రభుత్వం కూడా సంఘాల నేతల తలరాతలు మార్చడానికి సిద్ధం అయింది. ఉద్యోగుల కోసం జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ప్రభుత్వం లేదని, అందరికోసం అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఎప్పుడో చెప్పారు. గొంతెమ్మ కోర్కెలు ఎన్ని తీర్చినా ఇంకా ఉంటాయని ఉద్యోగులను మంత్రి బొత్స సత్యనారాయణ ఎత్తి పొడిచాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నేతలను దువ్వె ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం 3 వేల కోట్లు ఇస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెబుతున్నారు. కానీ, పోరాటం దిశగా ఉద్యోగ సంఘాలు వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి కి సవాల్ గా మారింది. అందుకే బడా ఉద్యోగులు, అవినీతి కోరుల మీద ఏసీబీ ని సిద్ధం చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే కోటీశ్వర్లుగా ఉండే టీడీపీ సానుభూతి ఉద్యోగుల  జాబితా తయారు చేశారని వినికిడి. ఇక వాళ్ళ భరతం పట్టడానికి సమయం కోసం ఏసీబీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంకేతాల కోసం చేస్తుందట.

ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి

ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మ అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైన విషయం విదితమే. ఈసమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ,ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.అదే విధంగా ఈసమావేశంలో ఉద్యోగ సంఘాల తరపున రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి, ఎపిఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి జెఎసి, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు వారి వారి సంఘాల ప్రతినిధులు (Employee Movement) పాల్గొన్నారు.

మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని

మంగళవారం చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశమయ్యారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ తదితర సంఘాల నేతలు హాజరయ్యారు. ఈసారి కూడా కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల (Employee’s) సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు అహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమండ్‌ చేశారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. మార్చి 9న జరిగే ఉద్యమం యధావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చి చెప్పారు. చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పడం హీట్ ఎక్కిస్తుంది.

Also Read: AP Employees : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ స్వారీ, `క‌మాండ్ అండ్ కంట్రోల్` లో ఉద్య‌మం

మంత్రులు, ఎమ్మెల్యేల కు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని బొప్పరాజు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తూనే ఉంది. సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమబాట పట్టాయి. ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మండుతుంది. అందుకే ఏసీబీ ని అస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధం అయిందని తెలుస్తుంది. ఎన్ని అక్రమ చేపలు, తిమింగలాలు బయట పడతాయో చూడాలి. లేదా జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు జీ హుజుర్ అంటారో చూద్దాం.

Also Read:  ISRO: ఇస్రోతో భారతీయ రైల్వేల అగ్రిమెంట్.. ట్రైన్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ కోసమే