Bapatla: బాపట్లలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సెంటర్, ప్రారంభానికి సిద్ధం!

దేశవ్యాప్తంగా భారత వైమానిక దళం సేవలు విస్తరించబోతున్నాయి. ఏపీలో కూడా అత్యవసర ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు కాబోతుంది.

Published By: HashtagU Telugu Desk
Flight Emergency Landing

Flight Emergency Landing

Bapatla: బాపట్ల జిల్లా రేణంగివరం-కొరిసెపాడు జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటేటర్ సెంటర్‌ త్వరలోనే అందబాటులోకి రానుంది. ఈ సెంటర్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు. ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రంజిత్ మాట్లాడుతూ నవంబర్ 30లోగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటేటర్ సెంటర్ ప్రారంభోత్సవం ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే స్థానిక పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటేటర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు రంజిత్ తెలియజేశారు. బాపట్ల జిల్లాలో అత్యవసర సేవల సౌకర్యం కోసం NH-16పై 4.1 కి.మీ పొడవు, 33 మీటర్ల వెడల్పు గల కాంక్రీట్ స్ట్రిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు.

“భారత వైమానిక దళం డిసెంబర్ 2022లో ఈ ఎమర్జెన్సీ ఎయిర్‌స్ట్రిప్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. భారతదేశం అంతటా ఇటువంటి 20కి పైగా ఎయిర్‌స్ట్రిప్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తర్వాత ఇది మూడవ ఎయిర్‌స్ట్రిప్ మరియు దక్షిణ భారతదేశంలో మొదటిది” అన్నారాయన.

Also Read: Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై ‘సుప్రీం’ సంచలన నిర్ణయం, ఆ రాష్ట్రాలకు వార్నింగ్

  Last Updated: 10 Nov 2023, 03:25 PM IST